Nithiin: నితిన్‌కు యాక్సిడెంట్? .. అస‌లు విష‌యం ఇదే!

ABN , Publish Date - Jan 11 , 2024 | 02:26 PM

‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్‌’ చిత్రం త‌ర్వాత‌ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్‌ జరుగుతోంది. ఈక్ర‌మంలోనే నితిన్ గాయ‌ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి.

Nithiin: నితిన్‌కు యాక్సిడెంట్? .. అస‌లు విష‌యం ఇదే!
nithin

ఇటీవ‌లే ‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్‌’ చిత్రం ద్వారా హీరో నితిన్ (Nithiin) ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఆ చిత్రం జ‌నాల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో త‌న త‌దుప‌రి చిత్రం త‌మ్ముడు (THAMMUDU) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం హీరో నితిన్‌ (Nithiin) ‘తమ్ముడు’ (THAMMUDU) సినిమా షూటింగ్‌లో గాయపడ‌డంతో సంక్రాంతి వెళ్లే వ‌ర‌కు షూటింగ్‌ను నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ర‌ష్మిక‌తో క‌లిసి 2020లో చేసిన భీష్మ సినిమా త‌ర్వాత స‌రైన హిట్ లేని ఆయ‌న ఆ త‌ర్వాత మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, రంగ్ దే, మ్యాస్ట్రో, చెక్ వంటి సినిమాలు చేసినా అవేవీ హిట్‌ను అందిచ‌లేక‌పోయాయి. తాజాగా డిసెంబ‌ర్‌లో విడుద‌లైన ‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్‌’ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌డంతో యువ హీరోల‌తో రేసులో వెనుక‌బ‌డిపోయారు. ఈ క్ర‌మంలో వ‌కీల్‌సాబ్ సినిమాను డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న త‌మ్ముడు (THAMMUDU) చిత్రంపైనే నితిన్ ఆశ‌లు పెట్టుకున్నాడు.


శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు ఈ తమ్ముడు(THAMMUDU) చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్‌ జరుగుతోంది. ఈక్ర‌మంలోనే నితిన్ గాయ‌ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని ఆయ‌న హెల్తీగా ఉన్నార‌ని, చిన్న భుజం నొప్పి వ‌ల్ల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని సంక్రాంతి పండుగ అనంత‌రం జ‌న‌వ‌రి 15 త‌ర్వాత షూటింగ్‌లో పాల్గొంటార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.

Updated Date - Jan 11 , 2024 | 02:26 PM