Aadi Saikumar: 'శంబాల' ది మిస్టికల్ ల్యాండ్ హాలీవుడ్ రేంజ్‌లో తెలుగు సినిమా

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:00 PM

గతంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు. హాలీవుడ్ స్థాయి నిపుణులు పని చేస్తున్న ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటుంది.

'Shambala' Poster

డిసిప్లిన్, డెడికేషన్‌కు కేరాఫ్‌గా నిలిచిన ఆది సాయికుమార్ (Aadi Saikumar) ఈసారి జియో సైంటిస్ట్‌గా ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆనంది (Anandi) ఈ సినిమాలో ఆదికి జోడీగా 'ఏ' యాడ్ ఇన్‌ఫినిటిమ్ అనే డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని ( Yugandhar Muni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'శంబాల ది మిస్టికల్ ల్యాండ్' (Shambala the Mystical Land). ఈ సినిమా తొలి పోస్టర్‌తోనే.. గతంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు. హాలీవుడ్ స్థాయి నిపుణులు పని చేస్తున్న ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటుంది.


ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్‌లో రూపొందుతున్న సినిమా 'శంబాల'. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. టైటిల్ పోస్టర్‌లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం ఇవన్నీ చూస్తుంటే 'శంబాల' కథలో వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్స్‌ చాలానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకు టచ్‌ చేయని డిఫరెంట్ స్టోరీ లైన్‌ను చూపించబోతున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్న యుగంధర్‌, 'శంబాల' సినిమాను హాలీవుడ్ స్థాయిలో హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా విజువల్స్‌ పరంగా, టెక్నికల్‌ గా సినిమాను టాప్‌ క్లాస్‌ అనే రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.


డ్యూన్, ఇన్సెప్షన్, బ్యాట్ మ్యాన్, డన్ కిర్క్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హాన్స్‌ జిమ్మర్‌ లాంటి లెజెండరీ హాలీవుడ్ కంపోజర్స్‌తో కలిసి పని చేసిన ఇండియన్ మ్యూజీషియన్‌ శ్రీరామ్‌ మద్దూరి ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్స్ స్కోర్స్ విషయంలోనూ ఇంతకు ముందు ఏ సినిమాలో ఎక్స్‌పీరియన్స్ చేయని కొత్త సౌండింగ్‌ను ఈ సినిమాలో వినిపించబోతున్నట్లు సమాచారం.

Updated Date - Oct 19 , 2024 | 03:00 PM