Box Office:1000 కోట్లు.. ఏడుగురు డైరెక్టర్లు

ABN , Publish Date - Dec 16 , 2024 | 09:08 PM

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రూ. 1000 కోట్లను ఎనిమిది సినిమాలు మాత్రమే సాధించాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఆ డైరెక్టర్లు ఎవరెవరంటే..

ఐదు బడా ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్న భారత్‌లో కేవలం ఒక ప్రాంతానికి చెందిన మూవీ రూ. 1000 కోట్ల కలెక్షన్స్‌ని కొల్లగొట్టడం సాధారణమైన విషయం కాదు. భిన్నమైన భాషలు, భిన్నమైన సంస్కృతులు వీటిలో ఏకత్వం సాధించాలంటే గొప్ప వీరుడే దిగి రావాలి. అయితే సినీ ఇండస్ట్రీలో ఈ లాంగ్వేజ్, కల్చరల్, రీజినల్ బేరియర్స్ చేరిపి పడేశారు బాహుబలి 'ఎస్ ఎస్ రాజమౌళి'. బేరియర్స్ ని చేరిపేశాక బాక్సాఫీస్ రికార్డులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రూ. 1000 కోట్లను ఎనిమిది సినిమాలు మాత్రమే సాధించాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఆ డైరెక్టర్లు ఎవరెవరంటే..


1. బాహుబలి 2(2017)

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ మోషన్ పిక్చర్ 'బాహుబలి 2' రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా నిలిచింది.

2. దంగల్(2016)

క్లాసిక్ బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి దర్శకత్వం వహించిన 'దంగల్' బాహుబలి 2 కన్న ముందే రిలీజ్ అయినా టెక్నీకల్‌గా 'బాహుబలి 2' తర్వాతే 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టింది.

3. కేజీఎఫ్ చాప్టర్ 2 (2022)

కన్నడ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ప్రశాంత్ నీల్. మొదటగా తీసిన కేజీఎఫ్ మూవీ కొనసాగింపు కేజీఎఫ్ చాప్టర్ 2 1000 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.

4. పఠాన్ (2023)

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో కలిసి సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ కలెక్ట్ చేసిన రెండో బాలీవుడ్ మూవీగా నిలిచింది.

5. జవాన్(2023)

సౌతిండియన్ సూపర్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ని మరోసారి 1000 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లాడు.

6. ఆర్ఆర్ఆర్ (2023)

1000 కోట్ల క్లబ్ లోకి రెండవసారి అడుగుపెట్టి భారతీయ సినిమాని గ్లోబల్‌కి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది.

7. కల్కి 2898 AD (2024)

టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరోసారి తెలుగోడి తడాఖా చూపెట్టాడు.

8. పుష్ప 2 (2024)

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న పుష్ప రాజ్ గాడి 'పుష్ప 2' సామ్రాజ్యాన్ని నిర్మించిన సుకుమార్ తాజాగా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Updated Date - Dec 16 , 2024 | 09:08 PM