6Journey: ప్రేమికుల కోసం ‘6జర్నీ’ లవ్ సాంగ్..
ABN , Publish Date - Feb 14 , 2024 | 09:11 PM
పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ‘ఆకాశంలోని చందమామ’ అనే సాంగ్‌ను విడుదల చేశారు.

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ‘ఆకాశంలోని చందమామ’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. మూవీకి ఎం.ఎన్.సింహ సంగీత సారథ్యం వహింస్తున్నారు. రామారావు మాతుమూరు రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. (6Journey Movie Aakasam loni Chandamama Song)
ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు బసీర్ ఆలూరి, నిర్మాత పాళ్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. మా అరుణకుమారి ఫిలింస్ బ్యానర్‌లో రూపొందుతున్న ‘6జర్నీ’ మూవీ నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ‘ఆకాశంలోని చందమామ..’ అనే పాటను విడుదల చేస్తున్నాం. లవ్, థ్రిల్లింగ్ సహా అన్ని ఎలిమెంట్స్‌తో ‘6జర్నీ’ తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?
***********************
*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..
*************************
*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..
***************************