Rashmika Mandanna: కలిసే వెళ్లారా.. అనుకోకుండా కలిశారా.?

ABN , Publish Date - Dec 06 , 2024 | 09:34 AM

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. 


రష్మిక మందన్నా(Rashmika Mandanna), విజయ్‌ దేవరకొండల (Vijay devarakonda) క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.  కలిసి టూర్స్‌కి వెళ్లడం ఆ ఫొటోలు వైరల్‌ కావడం ఈ రూమర్స్‌కు కారణం. అంతే కాదు.. రెండేళ్లగా రష్మిక దీపావళి ఫెస్టివల్‌ను దేవరకొండ కుటుంబంతో సెలబ్రేట్‌ చేసుకోవడం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం అందుకు ఓ కారణం. తాజాగా మరోసారి రష్మిక, దేవరకొండ ఫ్యామిలీ వార్తలో నిలిచారు. తాజాగా దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక ఆమె కథానాయికగా నటించిన పుష్ప-2 (Pushpa 2) సినిమాను వీక్షించింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో విజయ్‌ దేవరకొండ తల్లి, సోదరుడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి ఈ సినిమాను చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక బాండింగ్‌ మరింత బలపడినట్లు కనిపిస్తోంది. అయితే విజయ్‌ తల్లి, రష్మిక సినిమాకు కలిసే వెళ్లారా? లేక అనుకోకుండా థియేటర్‌లో కలిశారా అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యన దేవరకొండ ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేషన్స్‌, ఇప్పుడు విజయ్‌ తల్లి మాధవితో కలిసి సినిమాకు వెళ్లడం చూస్తే.. విజయ్‌, రష్మికల పెళ్లి వార్తలు వాస్తవమే అనిపిస్తోంది. ఇదే, మాట నెటిజన్లు కూడా చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి. (Wild Fire)

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా శ్రీవల్లి పాత్రతో మెప్పించింది రష్మిక మందన్న. ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్‌ యాప్ట్‌ అయిందని, పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అంతే కాదు.. నటనతోనే కాకుండా డాన్స్‌తో కూడా అలరించిందని మెచ్చుకుంటున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించారు. మైతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

Updated Date - Dec 06 , 2024 | 09:34 AM