హన్సిక గ్లామర్ డాల్ కాబట్టి కొత్తగా చూపించాలి అనుకున్నాం: నిర్మాత బొమ్మకు శివ

ABN , Publish Date - Jan 24 , 2024 | 05:21 PM

ఇంతకు ముందు రెండు లేక మూడు పాత్రలు పెట్టి సినిమా తీశారు, కానీ ఇప్పుడు సినిమా అంతా ఒకటే పాత్రతో ఒక ప్రయోగాత్మక చిత్రంగా '105 మినిట్స్' అనే చిత్రం ఈ శుక్రవారామ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇలాంటి ప్రయాగాత్మక సినిమా చెయ్యడానికి నిర్మాత బొమ్మకు శివ ఏంటి ప్రేరణ అతని మాటల్లోనే....

హన్సిక గ్లామర్ డాల్ కాబట్టి కొత్తగా చూపించాలి అనుకున్నాం:  నిర్మాత బొమ్మకు శివ
A still from 105 Minutes

మీ నేటివ్ ప్లేస్ అండ్ నిర్మాత కాకముందు మీరేం చేశారు?

పుట్టింది పెరిగింది అంత హైదరాబాద్ బోడుప్పల్ లో. రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్ లు ఉన్నాయి.

సినిమా రంగంలోకి ఎలా వచ్చారు నిర్మాతగా ఎలా మారారు?

సినిమాలంటే నాకు చాలా ప్యాషన్. ఎప్పటికన్నా ఒక సినిమా నిర్మించాలని కల ఉండింది అది ఈ సినిమాతో నెరవేరింది.

ఈ సినిమా కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది?

రాజు నాతో ఒక సంవత్సరం నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఈ కథ విన్నప్పటి నుంచి కథ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువైంది. ఫస్ట్ సినిమా చేస్తే ఈ కథతోనే చేయాలనుకున్నాను.

bommanasuman.jpg

హన్సికని అనుకున్నారా ముందు? హన్సికని ఎలా అప్రోచ్ అయ్యారు?

ముందు వేరే హీరోయిన్ అనుకున్నాము. తర్వాత ఈ కథకి హన్సిక సెట్ అవుతారని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయి ఒప్పుకున్నారు.

సినిమా మీద ప్యాషన్ అన్నారు కమర్షియల్ సినిమా కాకుండా 105 మినిట్స్ అని ప్రయోగాత్మక సినిమాతో ఎందుకు వస్తున్నారు?

ఒక కొత్త జోనర్ లో ప్రయోగాత్మకంగా రావాలనుకున్నాం, అందుకే 105 మినిట్స్ కథని ఎంచుకున్నాం.

ఈ కథలో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్స్ ఏంటి? సినిమా ఎన్ని డేస్ షూట్ చేశారు?

సింగిల్ ఆర్టిస్ట్ సింగిల్ టేక్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. మామూలుగా షూట్ కి 20 రోజులు పడితే ముందుగా ట్రైలర్ లాగా చేసాము, ఆ తరువాత ప్రాక్టీస్ చేసుకుని చేయడానికి 45 రోజులు పట్టింది.

హన్సిక స్టార్ హీరోయిన్, గ్లామర్ డాల్ ఈ కథకి ఎలా ఒప్పించడం జరిగింది?

గ్లామర్ డాల్ కాబట్టే కొత్తగా చూపించాలి అనుకున్నాం. హన్సిక కూడా చేస్తాను అని ఒప్పుకోవడం చాలా పాజిటివ్ గా అనిపించింది.

సినిమా మొత్తం ఒకటే క్యారెక్టర్ ఉంటుందా, వేరే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా?

సినిమా మొత్తం ఒకటే పాత్ర ఉంటుంది, కానీ ఇంకో గొంతు వినిపిస్తుంది ఆ గొంతు కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న యాక్టర్. అతను హిందీలో మంచి నటుడు. ఆయన గొంతు వినిపిస్తూ ఉంటుంది.

hansikain105minutes.jpg

రిలీజ్, డిస్ట్రిబ్యూషన్ ఎలా ప్లాన్ చేశారు?

మైత్రి వాళ్లకి సినిమా ఇచ్చాము. వాళ్ళే డిస్ట్రిబ్యూషన్, రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

ఒక్క తెలుగులోనే విడుదల చేస్తున్నారా లేక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారా?

ప్రస్తుతం అయితే వరల్డ్ వైడ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. నెలకి ఒక భాషలో చొప్పున తరువాత వచ్చే ఐదు నెలలు ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తాం.

సినిమాకి ఇంటర్వెల్ ఏమన్నా ఉందా కంటిన్యూగా 105 మినిట్స్ ప్లే చేస్తున్నారా?

మేమైతే ఇంటర్వెల్స్ ఏమి ప్లాన్ చేయలేదు కానీ థియేటర్ వాళ్ళు వాళ్ళ ఇష్టం మేరకు ఇంటర్వెల్ ఇస్తే ఇవ్వచ్చు.

సినిమా అనుకున్న బడ్జెట్ లోనే తీశారా?

సినిమా అనుకున్న బడ్జెట్లోనే తీసాము 3 కోట్లు అనుకున్నాము, కానీ 3.5 కోట్లు దాకా అయింది.

Updated Date - Jan 24 , 2024 | 05:21 PM