Radhamma Kuthuru: స్వలాభం కోసం నా భర్తనే లేపేశా.. సీరియల్ నటి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 07 , 2024 | 12:22 PM
స్వలాభం కోసం నా భర్తనే లేపేశా.. సీరియల్ నటి సంచలన వ్యాఖ్యలు అనగానే నిజంగానే ఆ నటి ఏదో చేసేసిందని అనుకుంటున్నారేమో.. అయితే అది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. ‘రాధమ్మ కూతురు’ సీరియల్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్రలో నటించిన చందన.. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఆమె ఎలా నటిగా మారింది? తన యాక్టింగ్ గురించి.. ఇలా ఎన్నో విషయాలను ఈ చిట్ చాట్‌లో షేర్ చేసుకున్నారు.
స్వలాభం కోసం నా భర్తనే లేపేశా.. సీరియల్ నటి సంచలన వ్యాఖ్యలు అనగానే నిజంగానే ఆ నటి ఏదో చేసేసిందని అనుకుంటున్నారేమో.. అయితే అది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. ‘రాధమ్మ కూతురు’ (Radhamma Kuthuru) సీరియల్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న నీలాంబరి (Neelambari) పాత్రలో నటించిన చందన (Chandana).. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఆమె ఎలా నటిగా మారింది? తన యాక్టింగ్ గురించి.. ఇలా ఎన్నో విషయాలను ఈ చిట్ చాట్‌లో ఆమె షేర్ చేసుకున్నారు.
Also Read- Prabhas: ప్రభాస్ ఫర్ ఏ రీజన్.. వయనాడ్ బాధితుల సహాయార్థం భారీ విరాళం
స్వలాభం కోసం ఎవరినైనా లేపేస్తారా? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘తప్పదు కదండీ సీరియల్‌లో.. సీరియల్ అంటే అలాగే ఉంటుంది. రైటర్ ఎలా రాస్తే.. అలా చేయడమే నటీనటుల పని. సీరియల్‌లో ఇలా ఉన్నాను కదా.. అని రియల్ లైఫ్‌లో కూడా అలా ఉంటానని అనుకోకండి. రియల్ లైఫ్‌లో నా భర్తని చాలా బాగా చూసుకుంటాను. ‘రాధమ్మ కూతురు’ సీరియల్‌లో నేను ఓ MPకి సెకండ్ భార్యగా చేశాను. అసలు ఆ మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ప్రాపర్టీస్, రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లాలనేది నా పాత్ర స్వరూపం. కానీ నా భర్త అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో.. నేనే అతనిని షూట్ చేస్తాను. ఇప్పుడు నిజమైన నీలాంబరిగా అక్షరను ఎదుర్కొంటున్నాను’’ అని చందన తెలిపారు. (Chit Chat with Radhamma Kuthuru Actress)
అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మాది వరంగల్. పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్ రావడం జరిగింది. ఈ ఫీల్డ్‌లో పరిచయాలంటూ ఏమీ లేవు. డైరెక్టర్‌కి మా తమ్ముడు తెలుసు. తెలుగులో ‘గంగ-మంగ’ (Ganga Manga) అనే సీరియల్‌లో మా పాప యాక్ట్ చేసింది. మా పాపకి పేరెంట్‌లా ఆ షూట్‌కి వెళ్లాను. తన షూట్ అయిన తర్వాత అందరూ మీరు కూడా యాక్ట్ చేయండి అంటూ సలహాలు ఇచ్చారు. అలా నేను కూడా నటిగా మారాను.
Also Read- Kavya Thapar: ఇస్మార్ట్ శంకర్ మిస్సయ్యా.. 'డబుల్ ఇస్మార్ట్' లో బోల్డ్ క్యారెక్టర్ చేశా
‘రాధమ్మ కూతురు’ సీరియల్ చూసే వాళ్లు నన్ను తిట్టుకుంటున్నారంటే.. నేను చాలా బాగా యాక్ట్ చేస్తున్నాననే ఫీలింగ్ నాకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ రియల్ లైఫ్‌లో నా క్యారెక్టర్ అలా ఉండదు. పూర్తిగా రివర్స్‌లో ఉంటుంది..’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె ఏమేం చెప్పారో తెలియాలంటే క్రింది వీడియో చూడాల్సిందే.
Read Latest Cinema News