Nayan Sarika: నా పెర్ఫామెన్స్ చూసి తారక్, బన్నీ అభినందించారు..

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:21 PM

ఆగ‌స్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆయ్’ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుని మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంట‌గా న‌టించింది న‌య‌న్ సారిక‌. ప్రస్తుతం ఆమె ‘ఆయ్’ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషించిన ప‌ల్ల‌వి పాత్ర ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింద‌ని సంతోష‌ప‌డుతుంది న‌య‌న్ సారిక‌.

Heroine Nayan Sarika

ఆగ‌స్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆయ్’ (Aay) సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుని మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాలో నార్నే నితిన్‌ (Narne Nithin)కు జంట‌గా న‌టించింది న‌య‌న్ సారిక‌ (Nayan Sarika). ప్రస్తుతం ఆమె ‘ఆయ్’ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషించిన ప‌ల్ల‌వి పాత్ర ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింద‌ని సంతోష‌ప‌డుతుంది న‌య‌న్ సారిక‌. ఈ సంద‌ర్భంగా త‌న‌పై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమె ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది.

Tarak-and-Arjun.jpg

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రేక్ష‌కులు మా సినిమాను ఇంత గొప్ప‌గా ఆద‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. టాలీవుడ్‌లో ఒక మంచి విజ‌యంతో నా ప్ర‌యాణం ప్రారంభం కావ‌టం నాకెంతో సంతోషంగా ఉంది. ఓ సినిమా స‌క్సెస్ అనేది ఎంటైర్ టీమ్‌కు సంబంధించింది. అయితే ‘ఆయ్’ స‌క్సెస్ మాత్రం నాకు వ్య‌క్తిగ‌తంగా ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇంత మంచి సినిమాలో న‌న్ను భాగం చేసిన గీతా ఆర్ట్స్ సంస్థ‌కు, ద‌ర్శ‌కుడు అంజి కె. మ‌ణిపుత్ర‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌తలు.

Also Read-NBK: ఎన్ని బిరుదులు, ట్యాగ్స్ తగిలించినా.. బాలయ్యకు అలా పిలిస్తేనే ఇష్టం


Nayan-Sarika-1.jpg

స్కూల్, కాలేజీ టైమ్‌లో డ్రామాల్లో న‌టించినప్పుడే హీరోయిన్‌ కావాలనే కోరిక కలిగింది. ‘ఆయ్’ సినిమాలో న‌టించాల‌నే ఆఫర్ వచ్చినప్పుడు నా డ్రీమ్ నెరవేరబోతోందని ఎంతో సంతోషించాను. ‘ఆయ్’ సినిమా షూటింగ్ ప్రారంభం కావ‌టానికి ముందు నేను, నార్నే నితిన్ క‌లిసి రిహార్సల్స్, వ‌ర్క్ షాప్స్‌లో పాల్గొన్నాం. తెలుగు కోసం ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నాం. నా టీమ్ స‌భ్యులు కూడా నాకెంతో స‌పోర్ట్ చేశారు. (Nayan Sarika Happy with Aay Success)

Also Read- NBK@50: ఇన్విటేషన్స్ రాలేదనే ఫిర్యాదులపై.. ఆర్గనైజర్స్ ఏమన్నారంటే..

డిగ్రీ చదువుతుండగానే నాకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెప్పించాల‌నుకున్న క‌ల నేర‌వేరుతున్న‌ప్ప‌టికీ చ‌దువుని మాత్రం అశ్రద్ధ చేయ‌లేదు. న‌టిస్తూనే డిగ్రీని పూర్తి చేయాల‌నుకున్నా. ‘ఆయ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే ఫైన‌లియ‌ర్ డిగ్రీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యాను. షూటింగ్‌కి నేను బుక్స్‌, స్ట‌డీ మెటీరియ‌ల్ తీసుకెళ్లేదాన్ని. డిగ్రీ ఫైన‌లియ‌ర్ ఎగ్జామ్స్ పూర్తి చేయ‌టానికి నేను క్యారీవ్యాన్‌లో షూటింగ్ గ్యాప్‌లో చ‌దువుకుంటుండేదాన్ని. ఓ వైపు షూటింగ్, మ‌రో వైపు ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ కావ‌టం అనేది చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.


Nayan-Sarika-2.jpg

‘ఆయ్’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించినందుకు ఒకవైపు, మరోవైపు ఎన్టీఆర్ (Jr NTR), అల్లు అర్జున్‌ (Allu Arjun) వంటి స్టార్స్ నా నటన గురించి మాట్లాడుతుంటే.. నిజంగా నా ఆనందం వర్ణించలేను. సినిమాలో చాలా ఈజ్‌తో నా క్యారెక్ట‌ర్‌లో న‌టించాన‌ని ఎన్టీఆర్‌గారు అభినందించారు. అల్లు అర్జున్‌గారైతే న‌న్ను ద‌క్షిణాది అమ్మాయి అనే అనుకున్నారు. నేను దక్షిణాది అమ్మాయిని కాద‌ని తెలిసి అంత చ‌క్క‌గా పాత్ర‌లో ఒదిగిపోయినందుకు ఆశ్చ‌ర్య‌పోయారు. క‌ళ్ల‌తో చ‌క్క‌గా హావ‌భావాల‌ను ప‌లికిస్తాన‌ని అల్లు అర‌వింద్‌గారు ప్ర‌శంసించారు. అంత పెద్ద స్టార్స్ నుంచి ప్ర‌శంస‌లు రావ‌టం నాకెంతో గొప్ప‌గా అనిపించింది’’ అని తన సంతోషాన్ని తెలియజేసింది న‌య‌న్ సారిక‌.

Read Latest Cinema News

Updated Date - Aug 31 , 2024 | 05:21 PM