Upendra: ‘UI ది మూవీ’.. బహుశా ఆ గట్ ఫీలింగ్ తో వెళ్తున్నానేమో
ABN , Publish Date - Dec 18 , 2024 | 12:04 PM
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన నుండి సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక కొత్త విషయం ఉంటుందని నమ్మే అభిమానులే ఎక్కువ. ఇప్పుడాయన నుండి వస్తోన్న మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా చిత్రం ‘UI ది మూవీ’. డిసెంబర్ 20న విడుదల కాబోతోన్న ఈ చిత్రం గురించి ఉపేంద్ర ఏం చెప్పారంటే..
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా చిత్రం ‘UI ది మూవీ’. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహ నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా హీరో ఉపేంద్ర ఈ సినిమా విశేషాలను మీడియాకు తెలియజేశారు.
ఈ మూవీ కాన్సెప్ట్, ఐడియా ఎలా మొదలైంది?
మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏ ఫర్ ఆపిల్.. బి ఫర్ బ్యాట్.. ఇలా నేర్పించారు. వాళ్లు ఏం చెప్తే అది బట్టీపట్టి దాన్నే నేర్చుకున్నాం. అదొక సిస్టంలాగా మారిపోయింది. దీనివలన మన థింకింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అప్పుడే ఏ ఫర్ ఆపిల్‌తో పాటు ఇంకొన్ని వర్డ్స్ చెప్పుంటే మన ఆలోచన మరోలా ఉండేది. నా కథల్లో కూడా అలాంటి ఏదైనా ఒక కొత్త ఆలోచననే చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాను. అలా నా సినిమాలకు కాన్సెప్ట్, ఐడియా క్రియేట్ అవుతుంటుంది. ‘UI ది మూవీ’ ఆలోచన కూడా అలా వచ్చినదే. యు అండ్ ఐ... మీలోనూ నాలోను ఒకటే కథ ఉంది. నేను ఆలోచిస్తున్నట్టుగానే మీరు ఆలోచిస్తున్నారా? క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మన ఆలోచనలన్నీ ఒకేలా ఉన్నాయి. నేను ఫీల్ అవుతున్నదే మీరూ ఫీల్ చేస్తున్నారు. ఇది ఆడియన్స్‌తో ఇంటరాక్టివ్ అయ్యే సినిమా. చూస్తున్నప్పుడు ప్రేక్షకులే చాలా విషయాల్ని డీకోడ్ చేస్తారు. ఈ సినిమాని మెటాఫరికల్ చేశాం. నా వరకు థియేటర్లో కూర్చుని సినిమా చూసిన ఆడియన్సే అసలైన స్టార్స్. నా మొదటి సినిమాతోనే దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆడియన్స్ ఎప్పుడూ కూడా ఒక ఫిలిం మేకర్ కంటే పైనే ఉంటారు. ఈ సినిమాతో ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతారు.
అమీర్ ఖాన్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు కదా..?
అమీర్ ఖాన్ గారు చాలా బిగ్ స్టార్. ఆయనకి మా సినిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది. అదంతా ఆయన గొప్పతనం. ఆయన సినిమా గురించి మాట్లాడారు. అది మాకు చాలా హెల్ప్ అయింది.
మీ సినిమాల్లో ఎప్పుడూ ఒక ఆవేశం ఉంటుంది. అలాంటి కథలు చెప్పాలనే ధైర్యం మీకు ఎలా వచ్చింది?
అదంతా నేను ఆలోచించను.. నాకు చెప్పాలనిపించింది సినిమా ద్వారా చెప్పేస్తాను. ఏంజెల్స్ వెళ్లడానికి భయపడే దారిలో.. ఒక పూల్ వెళ్తాడని సామెత ఉంది. బహుశా ఆ గట్ ఫీలింగ్‌తో వెళ్తున్నానేమో. ఇదంతా ఆడియన్స్ గొప్పతనంగానే భావిస్తా.. నా సినిమాలన్నింటి గురించి చాలా చక్కగా డీకోడ్ చేసి అంతలా గుర్తుపెట్టుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది.
ఈ సినిమా వార్నర్ వీడియోలో కల్కి లాంటి కాంప్లెక్స్ కనిపించింది.. దాని గురించి చెప్పండి?
అందులో మైథిలాజికల్ కల్కి చూశారు. ఇందులో సైకలాజికల్ కల్కి చూస్తారు.
మీ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది. లుక్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు?
నిజానికి లుక్ విషయంలో ఇందులో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఏడాది స్క్రిప్ట్‌కి పడితే మరో ఏడాది లుక్, క్యారెక్టర్ డిజైన్‌కే పట్టింది.
‘UI ది మూవీ’ టెక్నికల్ వాల్యూస్ గురించి?
ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఒక సర్రియల్ వరల్డ్ క్రియేట్ చేశారు. చాలా డిఫరెంట్ సెట్స్ డిజైన్ చేశాం. ఇందులో ఉండే సెట్స్ మొదట్లో చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి. తర్వాత డీకోడ్ చేసినప్పుడు దాని వెనుక ఉన్న మీనింగ్ అర్థం అవుతుంది. అజనీస్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్. తను పాన్ ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు చాలా టైం ఇచ్చి చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. హంగేరీలో రికార్డింగ్ చేశాము. చాలా వండర్ ఫుల్‌గా వచ్చింది.
సినిమా రన్ టైం గురించి?
సినిమా 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్ ఉంటుంది. నాకు ఏదైనా విషయాన్ని లాగ్ చేసి చెప్పడం ఇష్టం ఉండదు. సినిమా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది.
‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత తెలుగులో మళ్లీ సినిమా చేయకపోవడానికి కారణం?
అల్లు అర్జున్ నాకు ఫేవరెట్ యాక్టర్. నేను ఆయనకి ఫ్యాన్‌ని. అలాగే త్రివిక్రమ్ గారంటే చాలా ఇష్టం. ఆ ఇద్దరు కాంబినేషన్‌లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ సినిమా తర్వాత కూడా కొన్ని కథలు వచ్చాయి. అయితే నా మూవీ వర్క్స్ ఉండడం వల్ల చేయడం కుదరలేదు.
మీ సినిమాలకి సీక్వెల్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..?
లేదు. నా కథలకు పార్ట్ 2 చేసే ఆలోచన నాకు రాదు. ఇంకా ఏమైనా కొత్త కథలు చెప్పాలని ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ దీనికి రెండో పార్ట్ కూడా చేయాలని అంటే మాత్రం అప్పుడు ఆలోచిస్తాను.
మీ కథల్లో బాధ పెట్టే వాళ్ళ కంటే బాధపడే వాళ్ళని ఎక్కువ క్వశ్చన్ చేస్తారు? దాని గురించి చెప్పండి?
అవును నిజమే. మనం ఎక్కువగా ప్రాబ్లం గురించే మాట్లాడుతాం. సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే సొల్యూషన్ ఇవ్వడం చాలా డిఫికల్ట్. ఈ విషయంలో కొంచెం ట్రై చేస్తాను. సొల్యూషన్ ఇక్కడే ఉంది దాని గురించి ఆలోచించండి అని చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది కొంతమందికి అర్థమవుతుంది. కొంతమంది జాలీగా సినిమా చూసి వెళ్లిపోతారు.
మీ సినిమాలన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఉంటాయి కదా.. సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయిగా?
‘ఓం’ సినిమాకి చాలా ప్రాబ్లం అయింది. తర్వాత నా ‘ఏ’ సినిమా చూసి ‘థిస్ ఫిల్మ్ ఇస్ అన్ ఫిట్ ఫర్ రిలీజ్’ అని వెళ్ళిపోయారు. తర్వాత రివైజ్ కమిటీలో అద్భుతంగా ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. నా కథలు, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉంటాయి. బహుశా అందుకే అలా రియాక్ట్ అయి ఉంటారని భావించాను. ఈ సినిమా వరకు ఎలాంటి కట్స్ లేకుండా ఇచ్చారు.
ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే సినిమాలు తీయాలనేది మీ ఉద్దేశమా?
లేదు.. సినిమా అనేది ఎప్పుడూ కూడా ఎంటర్టైన్మెంట్ మీడియా. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వస్తారు. ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. ఈ సినిమాలో కూడా సాంగ్స్, ఫైట్స్ మంచి మ్యూజిక్‌తో విజువల్‌గా గ్రాండియర్‌గా ఉంటుంది. నార్మల్‌గా చూసినప్పుడు ఒక మంచి సినిమా లాగా ఉంటుంది. కొంచెం డీప్‌గా వెళ్తే ఇంకొక లేయర్ కనిపిస్తుంది. ఇంకా డెప్త్‌లో చూస్తే ఒక పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే ఫిలాసఫికల్ యాంగిల్ కనిపిస్తుంది. అన్ని ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఒక ఫిలిం మేకర్‌గా ఏదైనా మార్పు కోరుకుంటున్నారా?
మార్చడానికి నేను ఎవరిని? నన్ను నేనే మార్చుకోలేకపోతుంటాను. నేను మెసేజ్ ఇవ్వను. తీసుకోను. ఈ సినిమాలో కూడా అదే చెప్పాను.
ఒకప్పటికీ ఇప్పటికీ ఫిలిం టెక్నాలజీలో ఎలాంటి మార్పు వచ్చింది?
చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఒక రూమ్‌లో కూర్చుని ఒక ఫిలిం తయారు చేయవచ్చు. అయితే టెక్నాలజీని ఎలా వాడుతున్నాం అనేదాని మీదే అంతా డిపెండ్ అయి ఉంటుంది.
మీ సినిమాల్లానే, పోస్టర్స్ కూడా చాలా యూనిక్‌గా ఉంటాయి.. ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటారా?
నాగభూషణ్ అనే ఆర్టిస్ట్ చేస్తారు. సర్రిలిక్‌గా డిజైన్ చేయడం నాకు ఇష్టం. ఈ టైటిల్ కూడా ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత డీకోడ్ చేసేస్తారు.
నిర్మాతల గురించి?
అందరూ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఇంపార్టెంట్ అంటారు. నేను మాత్రం ఓనర్ ఆఫ్ ది షిప్ ఇంపార్టెంట్ అని అంటాను. ఈ సినిమాకి ఇంత పెద్ద స్కేల్లో ఖర్చు పెట్టి తీశారు అంటే ఆ క్రెడిట్ అంతా నిర్మాతలకే దక్కుతుంది. నిర్మాతలు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని తీశారు. చాలా సపోర్ట్ ఇచ్చారు. సినిమాకి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. అంతా టీం వర్క్.
రజనీకాంత్ గారితో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు కదా.. ఆ ఎక్స్‌పీరియెన్స్ ఏదైనా?
ఆయనతో వర్క్ చేయడం నా లైఫ్ డ్రీమ్. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. ఆయనతో సినిమా చేయడం నిజంగా వండర్ఫుల్ ఎక్స్‌పీరియెన్స్.