Gaami: వాష్ రూమ్ లేకపోవడం వలన నీరు తాగేదాన్ని కాదు: చాందిని

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:59 PM

విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నారు.

Gaami: వాష్ రూమ్ లేకపోవడం వలన నీరు తాగేదాన్ని కాదు: చాందిని
Chandini Chowdary

'గామి' సుధీర్గ ప్రయాణం కదా.. మీరు ప్రాజెక్ట్ లో ఎప్పుడు చేరారు ?

'గామి' ప్రాజెక్ట్ లో మొదటి రోజు నుంచి వున్నాను. 'మను' సినిమా చేసినపుడు దర్శకుడు విద్యాధర్ గారు పరిచమయ్యారు. 'గామి' అంటే సీకర్.. తాను అనుకున్న గమ్యాన్ని గమించేవాడు గామి. వారణాసి, కుంభమేళ, కాశ్మీర్, హిమాళయాలు.. ఇలా రియల్ లోకేషన్స్ లో ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరీంచాం. మా టీంలో నేను ఒక్కరే అమ్మాయిని. అందరం ఒక బస్ లో వెళ్లి సూర్యస్తమయం వరకూ షూటింగ్ చేసి వచ్చే వాళ్ళం. షూటింగ్ లో చాలా సవాల్ తో కూడిన పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా వాష్ రూమ్ యాక్సిస్ లేకపోవడం వలన నీరు కూడా తాగేదాన్ని కాదు. దాదాపు నెల పాటు ఇలా షూటింగ్ చేశాం. ఇందులో చూపించిన స్టంట్స్ రియల్ గా చేశాం. (I didn't drink water because there is no washroom access, says Chandini Chowdary) గడ్డకట్టిన మంచు పొరల మీద నడిచినప్పుడు పగుళ్ళు వచ్చాయి. పొరపాటున కిందపడితే ప్రాణానికే ముప్పు. అలాంటి సమయంలో నా దగ్గర ఉన్న లగేజ్ ని పారేసి జంప్ చేసి లక్కీగా బయటపడ్డాను. ఈ సినిమా ప్రయాణం అంతా ఒక సాహస యాత్రలా జరిగింది.

chandinichowdarygaami.jpg

హీరోయిన్ కమర్షియల్ సినిమాల రూట్ ని ఎంపిక చేసుకునే అవకాశం వున్నప్పుడు మీరు ఇంత ఛాలెంజింగ్ ఈ రూట్ ని ఎంపిక చేయడానికి కారణం?

కమర్షియల్ సినిమాలు చేయొచ్చు. నేను చేశాను కూడా. అయితే సినిమా పరిశ్రమలోకి వచ్చిందే ఒక పాషన్ తో. కొన్ని కథలు విన్నప్పుడు నన్ను నేను నియత్రించుకోలేను. 'గామి' కథ విన్నప్పుడు కూడా ఖచ్చితంగా అందులో భాగం కావాలనిపించింది. నా మనసుకి చాలా తృప్తిని ఇచ్చిన సినిమా ఇది. 'కలర్ ఫోటో' తర్వాత ఒక సీరియస్ పెర్ఫార్మార్ గా గుర్తింపు వచ్చింది. నా వర్క్ ని ఇంకా ఎలా మెరుగుపరిచుకోవచ్చు అనే దానిపైనే ద్రుష్టి పెడుతున్నాను. (Chandini Chowdary talks about her experience while shooting the film Gaami)

chandinichowdary.jpg

'గామి' విన్నప్పుడే ఈ సినిమా ఐదేళ్ళు పడుతుందని అనుకున్నారా ?

'గామి' కి సమయం పడుతుందని తెలుసు. ఎందుకంటే చెప్పే కథ పెద్ద కాన్వాస్ లో వుంది. మేము లిమిటెడ్ క్రూ తో వెళ్లాం. పైగా దర్శకుడు విద్యాధర్ క్రాఫ్ట్ మీద చాలా పర్టిక్యులర్ గా వుంటారు. తను అనుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తాడు. చాలా డిఫరెంట్ వాతావరణ పరిస్థితిలలో తీసిన సినిమా ఇది. దీనివలన తప్పకుండా సమయం పడుతుంది. అంత సమయం తీసుకున్నాం కాబట్టే విజువల్స్ ఇంత అద్భుతంగా వచ్చాయి. ఐమాక్స్ స్క్రీన్ లో ట్రైలర్ చూసినప్పుడు పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందని ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి.

ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?

ఇందులో నాది, విశ్వక్ పాత్రల కథలు ఒకదానితో ఒకటి మెర్జ్ అయ్యే వుంటాయి. ఎలా మర్జ్ అవుతాయనే తెరపై చూడాలి. గామి క్లైమాక్స్ ఫెంటాస్టిక్ గా వుంటుంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. గామి లాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. ఇలాంటి సినిమా వర్క్ అవుట్ అయితే ఇంలాంటి మరిన్ని అద్భుతమైన కథలు వస్తాయి.

chandinichowdarythree.jpg

విశ్వక్ తో వర్క్ చేయడం ఎలా అనిపించిది?

విశ్వక్ గ్రేట్ కో యాక్టర్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తను వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.

పరిశ్రమలో ఈ పదేళ్ళ ప్రయాణం ఎలా అనిపించింది ?

పరిశ్రమలో పదేళ్ళు పూర్తి చేసుకోవడం నిజంగా అన్ బిలివబుల్. పరిశ్రమలోకి వచ్చినపుడు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ ఆపకుండా ఎదో ఒకటి చేయాలి. కొన్నిసార్లు మనకి ఆప్షన్స్ వుంటాయి. అప్పుడు నచ్చింది చేయాలి. కొన్నిసార్లు ఆప్షన్ వుండదు. అప్పుడు వున్నది చేయాలి. ఏదేమైన పని చేస్తూనే వుండాలి. (Chandini Chowdary talks about 10-year-old journey in the film industry) పదేళ్ళు పూర్తి చేసుకోవడం నా ద్రుష్టిలో చాలా పెద్ద డీల్.

chandinichowdarytwo.jpg

ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?

అన్ని రకాల పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. నాకు ఇబ్బందిగా అనిపించని పాత్రలు చేస్తాను.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?

ఈ ఏడాది నేను నటించిన నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. నిర్మాతలు వివరాలని తెలియజేస్తారు. అలాగే ఝాన్సీ వెబ్ సిరిస్ మరో సీజన్ కూడా రాబోతుంది.

Updated Date - Mar 05 , 2024 | 02:59 PM