Karthik Gattamneni: తెలుగులో ‘ఈగల్’.. హిందీలో ‘సహదేవ్’ అని ఎందుకు పెట్టామంటే..

ABN , Publish Date - Feb 08 , 2024 | 06:55 PM

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మీడియాకు తెలియజేశారు.

Karthik Gattamneni: తెలుగులో ‘ఈగల్’.. హిందీలో ‘సహదేవ్’ అని ఎందుకు పెట్టామంటే..
Ravi Teja and Karthik Gattamneni

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఈగల్’ (Eagle). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

మీరేమో చాలా యంగ్ అండ్ కూల్‌గా కనిపిస్తున్నారు.. కానీ ‘ఈగల్’ ప్రమోషనల్ కంటెంట్‌లో అంతా విధ్వంసం కనిపిస్తోంది? అసలీ సినిమా ఎలా ఉండబోతోంది?

‘ఈగల్’ కాన్సెప్ట్‌లోనే విధ్వంసం వుంది. ఇది లార్జర్ దెన్ లైఫ్ ఎంటర్‌టైనర్. అతని విధ్వంసం సమాజం కోసమే. అదేమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో హీరో పత్తిపండించే రైతులా వుంటారు. అయితే అతను పోరాడుతున్న సమస్య అంతర్జాతీయంగా వుండేది. మనకి కూడా రిలవెంట్‌గా వుంటుంది. రాంబో, టెర్మినేటర్ లాంటి సినిమాలని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఒక సినిమా తీసుకురావాలనే ప్రయత్నం. ‘ఈగల్’ అద్భుతమైన యాక్షన్ డ్రామా ఎంటర్‌టైనర్. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. (Karthik Gattamneni Interview)

దర్శకుడిగా రెండో సినిమానే ఇంత పెద్ద యాక్షన్ చేయడం ఎలా అనిపించింది?

నాకు ముందు నుంచి యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం. అయితే కెరీర్ బిగినింగ్‌లో కొన్ని పరిమితులు వుంటాయి. ఇప్పుడీ సినిమాతో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది.


Ravi-Teja.jpg

మాస్ మహారాజాకి ఈ కథ ఎప్పుడు చెప్పారు?

రవితేజగారితో ‘ధమాకా’ సినిమాకి కెమెరామ్యాన్‌గా పని చేస్తున్న సమయంలో ఈ కథ ఆయనకి చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే.. ‘ఇది మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దాం’ అన్నారు.

నాకు నచ్చిన పాత్ర చేశానని రవితేజగారు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పడం ఎలా అనిపించింది?

రవితేజగారు బ్రిలియంట్ యాక్టరని అందరికీ తెలుసు. కానీ కొన్ని సార్లు కమర్షియల్ రీజన్స్ వలన ఒకే సినిమాలో కామెడీ డ్యాన్స్ యాక్షన్ ఇలా చాలా రకాలు చేయాల్సి వస్తుంది. ఈ సినిమాలో మాత్రం ఆయన ఒక క్యారెక్టర్‌లానే కనిపిస్తారు. ఆ తేడా చూసే ప్రేక్షకులకు అర్థమౌతుంది. ఇంటెన్స్‌గా ఉంటూ కూల్‌గా వుండటం ఆయనలో డిఫరెంట్ క్వాలిటీ.

ట్రైలర్‌లో కథ, కాన్సెప్ట్ గురించి కాస్త హింట్ కూడా ఇవ్వలేదు కదా.. స్క్రీన్‌ప్లే ప్రత్యేకంగా ప్రయత్నించారా?

ఈ కథకు సెకండరీ కాస్ట్ చాలా ముఖ్యం. ఆ పాత్రల ద్వారా కథానాయకుడు ఎవరని చెప్పే స్టయిల్‌ని ఎక్స్ ఫ్లోర్ చేశాం. విరుమాండి, రషోమన్, విక్రమ్ తరహా శైలి ప్రయత్నించాం. కాన్సెప్ట్ అంతా ముందే చెప్పేస్తే ఆ ఎక్జయిట్‌మెంట్ పోతుంది. సినిమా చూశాకా మీరు ట్రైలర్ చూస్తే.. కాన్సెప్ట్ క్లియర్‌గా ట్రైలర్‌లోనే చెప్పామని అర్థమైపోతుంది. (Karthik Gattamneni About Eagle)

రవితేజగారిలో మీరు గ్రహించిన విషయాలేంటి?

రవితేజగారి ఎనర్జీ లెవెల్స్ ఒక ఎత్తు.. అయితే ముఖ్యంగా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే వేళలు పర్ఫెక్ట్‌గా వుంటాయి. చాలా ఆనందమైన జీవితం గడుపుతుంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ వున్న మనిషి.

ఈ సినిమాకి ఈగల్ అని పేరుపెట్టడానికి కారణం?

‘ఈగల్’ నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఉండి కూడా.. కిందవున్న రాబిట్‌ని చూడగలదు. ఇందులో హీరోకి ఆ ఐ పవర్ వుంది. అలాగే ఈ పాత్రకు సినిమాలో కోడ్ నేమ్ కూడా ‘ఈగల్’. హిందీలో కూడా ఈ పేరు పెట్టడానికి ప్రయత్నించాం. ఇదే పేరుతో అక్కడ ఓ సినిమా వుంది. దీంతో ఈ కథలో హీరో పేరు ‘సహదేవ్ వర్మ’.. అందులో నుండి ‘సహదేవ్’ అనే టైటిల్‌తో హిందీలో విడుదల చేస్తున్నాం.

డీవోపీ, దర్శకత్వం.. రెండింటిలో ఏది ఇష్టమంటే..?

నాకు స్టోరీ టెల్లింగ్ ఇష్టం. అయితే డీవోపీ యాక్సిడెంటల్‌గా జరిగిపోయింది. దాన్ని ఒక బ్లెస్సింగ్‌గానే భావిస్తాను.

ఇందులో నవదీప్, అనుపమ, కావ్య పాత్రలు ఎలా వుంటాయి?

నవదీప్ పాత్ర చాలా కీలకంగా వుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరో ఆలోచనల్ని కాంప్లీమెంట్ చేసే పాత్రలో నవదీప్ కనిపిస్తారు. నవదీప్ తన నటనతో సర్‌ప్రైజ్ చేశారు. తనకి చాలా మంచి మెమరీ పవర్ వుంది. అలాగే అనుమప ఈ కథను ముందుకు నడిపించే పాత్రలో కనిపిస్తారు. కావ్య పాత్ర ఈ కథకు మరో ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే మరో చిన్న పాప పాత్ర కూడా కీలకంగా వుంటుంది.


Karthik-Ghattamaneni.jpg

ఇందులో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?

ఫిల్మ్ మేకింగ్‌లో లోతుగా వెళ్ళే కొలది సవాళ్ళు ఎదురౌతూనే వుంటాయి. మనకి వున్న అనుభవంతో ఐదు రోజుల్లో ఓ సీక్వెన్స్‌ని పూర్తి చేసేస్తామని అనుకుంటాం. కానీ అనుకున్న సమయానికి ఫినిష్ కాదు. ఈగల్‌లో క్లైమాక్స్ ఎపిసోడ్‌ని వారం రోజుల్లో తీసేయవచ్చని అనుకున్నా. కానీ అది 17 రాత్రుళ్ళు పట్టింది. దాని కోసం అన్ని రియల్ ఎఫెక్ట్స్ ప్రయత్నించాం. ఈ క్రమంలో దాదాపు నాలుగువందల మందిని ఇబ్బంది పెట్టాను. క్లైమాక్స్ చాలా అద్భుతంగా వచ్చింది.

ఈగల్ (Eagle) సౌండింగ్ కొత్తగా అనిపిస్తోంది? దాని గురించి?

ఈగల్ సౌండ్ డిజైన్ ఆరు నెలలు చేశాం. అన్ని రియల్‌గా ప్రొడ్యుస్ చేశాం. యూరప్‌లో రియల్ గన్స్‌తో షూట్ చేసి ఆ సౌండ్‌ని రికార్డ్ చేశాం. నేపధ్య సంగీతంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మంచి థియేటర్లో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవ్వొచ్చు. డేవ్ జాంద్ పదేళ్ళుగా తెలుసు. తనతో మంచి జర్నీ వుంది.

మణి బాబు డైలాగులు బావున్నాయి? ఆయన్ని తీసుకోవాలనే ఆలోచన మీదేనా?

ఆయనతో నేను కార్తికేయ 2 చేశాను. అప్పటినుంచి మా మధ్య అనుబంధం ఏర్పడింది. మాకు మంచి బ్యాలెన్స్ కుదిరింది. తన పదప్రయోగం చాలా బావుంటుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పని చేయడం ఎలా అనిపించింది?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోం బ్యానర్‌ అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిది ఒక్క ఫోన్ కాల్‌తో సమకూర్చుతారు. నిర్మాత విశ్వప్రసాద్‌గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు.

దర్శకుడిగా మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్?

తేజ సజ్జాతో ఓ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా గురించి తెలియజేస్తాం.


ఇవి కూడా చదవండి:

====================

*Director Maruthi: ‘ట్రూ లవర్’ జంటతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాం

**************************

*ప్రకటనలతో సరిపెట్టొద్దు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లండి: విజయ్‌కి ఈ సూచన ఎవరిచ్చారో తెలుసా..?

****************************

*Lal Salaam Trailer: ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. తలైవా డైలాగ్ వైరల్

*************************

*Vishal: పొలిటికల్ ఎంట్రీ, నూతన పార్టీ వార్తలపై విశాల్ ఏమన్నారంటే..

***********************

Updated Date - Feb 08 , 2024 | 06:55 PM