Prisha Singh: టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు చేయడానికి వెయిటింగ్..
ABN , Publish Date - Jul 23 , 2024 | 05:25 PM
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ప్రిషా సింగ్‌కు మక్కువ ఎక్కువ. ఆ ఇష్టమే టాలీవుడ్‌లో కెమెరా ముందు నటించే సమయంలో భయపడకుండా చేసిందని చెబుతోంది ప్రిషా సింగ్. అల్లు శిరీష్ కథానాయకుడిగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె టాలీవుడ్‌లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ప్రిషా సింగ్ (Prisha Singh)కు మక్కువ ఎక్కువ. ఆ ఇష్టమే టాలీవుడ్‌లో కెమెరా ముందు నటించే సమయంలో భయపడకుండా చేసిందని చెబుతోంది ప్రిషా సింగ్. అల్లు శిరీష్ (Allu Sirish) కథానాయకుడిగా శామ్ ఆంటోన్ (Sam Anton) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బడ్డీ’ (Buddy). ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె టాలీవుడ్‌లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ..
Also Read- Prakash Raj: మళ్ళీ వివాదంలో ప్రకాష్ రాజ్, తెలుగు ప్రేక్షకులంటే చిన్న చూపు
‘‘నా ఫొటోలను చూసి ‘బడ్డీ’ ఆడిషన్‌కు పిలిచారు. సెలక్ట్ అయ్యాను. అయితే పాత్రలోని వేరియేషన్స్ చూసి నేను చేయగలనా! అని చాలా ఆలోచించాను. ఈ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తాను. అందుకోసం నేను చాలా మంది ఎయిర్ హోస్టెస్‌ను గమనించాను. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడతారు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలను గమనించాను. ఈ క్రమంలో డైరెక్టర్‌గారు ఎయిర్ హోస్టస్ పాత్ర చేయటానికి నాకు కొన్ని రెఫరెన్స్‌లనిచ్చారు. అవేంతో ఉపయోగపడ్డాయి. టాలీవుడ్‌లో నటించటం నటిగా నాకొక మంచి ఎక్స్‌పీరియెన్స్. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ప్రిషా తెలిపింది.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ (Prisha Singh About Wild Life Photography) అంటే ప్రిషకు అభిరుచి ఎక్కువ. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. అడవుల్లో వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన యాత్రికులతో కలిసి సఫారీల్లో వెళ్లి అక్కడి జంతువులను తన కెమెరాల్లో బంధిస్తుంటుంది ప్రిష. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్లకు సంబంధించిన ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదు. వాటికి సంబంధించి సహజమైన భావోద్వేగాలను బంధించడం. అలాంటి విషయాలను నా కెమెరాలో బంధించినప్పుడు సంతృప్తిని, మంచి అనుభవాన్ని ఇస్తుంది. మనం కెమెరాలో బంధించే ప్రతి విషయానికి ఒక బలమైన కథ ఉంటుంది. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసింది. అందుకే కెమెరా ముందు ధైర్యంగా నటించగలుగుతున్నాను’’ అని తెలిపింది.
Read Latest Cinema News