Allu Arjun: పుష్ప-3 అనగానే వామ్మో..

ABN , Publish Date - Nov 15 , 2024 | 09:28 PM

‘నేను కృష్ణుడిని నువ్వు అర్జునుడివి. మనిద్దరం బంధువులం’ అని బాలకృష్ణ అనగా ‘మీరు గీత ఇవ్వండి.. నేను కురుక్షేత్రం చేస్తాను’’ అని  అల్లు అర్జున్‌ అన్నారు. 

నందమూరి బాలకృష్ణ (NBK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్‌ షో ుఅన్‌ స్టాపబుల్‌’ సీజన్‌ 4. (Unstoppable 4) ఈ షో నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (icon Star Allu Arjun) అతిథిగా పాల్గొన్నారు. తాజాగా ఈ షో ఆహా ఓటీటీ వేదికగా మొదటి పార్ట్‌ స్ట్రీమింగ్‌ అయింది. అందులో బన్నీ, బాలకృష్ణతో (Bala Krishna) ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘నేను కృష్ణుడిని నువ్వు అర్జునుడివి. మనిద్దరం బంధువులం’ అని బాలకృష్ణ అనగా ‘మీరు గీత ఇవ్వండి.. నేను కురుక్షేత్రం చేస్తాను’’ అని  అల్లు అర్జున్‌ అన్నారు.  ఆ విశేషాలు...

ఉత్తమ నటుడిగా తెలుగు సినిమాకు జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ క్షణం మీ ఫీలింగ్‌ ఏంటి?
అల్లు అర్జున్‌: నా దృష్టిలో అందరూ చూస్తేనే అది కమర్షియల్‌ సినిమా అవుతుంది.. అందరూ అంగీకరించిన చిత్రానికి అవార్డు రావడం లేదని చిన్నచూపు ఉండేది. దాన్ని చెరిపేయాలన్న తపనతో సినిమా చేశా. ఓసారి తెలుగు సినిమాలో నేషనల్‌ అవార్డు ఎవరికి వచ్చింది అని  చెక్‌ చేస్తే  ఒక్క తెలుగు హీరో పేరు కూడా లేదు. అది నా మనసులో ఉండిపోయింది. ఇంతమంది గొప్ప నటులు ఉన్నప్పటికీ వాళ్లకు జాతీయ అవార్డు ఎందుకు రాలేదని బాధపడ్డాను. అప్పుడే మనసులో అనుకున్నా.. దాన్ని రౌండ్‌ చేసి ఎలా అయినా దీన్ని సాధించాలనుకున్నా. సుకుమార్‌ ‘పుష్ప’ కథ చెప్పినప్పుడు ఈ చిత్రానికి నేషనల్‌ అవార్డు రావాలని చెప్పా. ప్రతి సన్నివేశం పూర్తికాగానే నేషనల్‌ అవార్డు గురించే మాట్లాడుకున్నాం. నా జాతీయ అవార్డును తెలుగు హీరోలందరికీ అంకితమిస్తున్నా. ఈ పురస్కారం నా నటనకు వచ్చిందని నేను భావించడం లేదు.. మీ అందరి తరఫున నాకు వచ్చిందని భావిస్తున్నా.

బాలయ్య: మనిద్దరం కలిసి పౌరాణికం చేయాలి?

నా భయంగా ఉంది సర్‌.. (బాలకృష్ణ: నేనున్నాగా)


గంగోత్రిలో ఉన్న అల్లు అర్జున్‌.. ఇప్పటి ఐకాన్‌స్టార్‌కు ఏం సలహా ఇస్తాడు?
అప్పుడు ఎలా ఉన్నావో.. ఇప్పుడు అలాగే ఉండు. ఏం మారొద్దు. పనిచేస్తూనే ఉండు. అలానే ఎదిగావు. అలాగే ఉండు. ఇదే చెప్తాడు.

పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు.. మనసులో ఏమనిపించింది?
అల్లు అర్జున్‌: నేను అసలు ఊహించలేదు. ‘పుష్ప’ను తెలుగులో విడుదల చేశాం. అలాగే అన్ని భాషల్ల్లోనూ రిలీజ్‌ చేద్దాం అనుకున్నాం. ఇలా నాలుగైదు సినిమాలు చేస్తే పాన్‌ ఇండియాలో గుర్తింపు వస్తుందనుకున్నా. అనుకోకుండా ‘పుష్ప’ సినిమాకే ఆ గుర్తింపు వచ్చింది.


‘పుష్ప 3’ ఉందా?

అల్లు అర్జున్‌: వామ్మో.. ఇప్పుడప్పుడే చేయలేను. రెండు సంవత్సరాల్లో మూడు సినిమాలు చేయాలని నా కోరిక.

Nbk.jpg

ఇప్పటి హీరోల్లో ఇష్టమైన హీరో ఎవరు?
అంతా చాలా బాగా నటిస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్‌ దేవరకొండ యాక్టింగ్‌ నాకు నచ్చింది. తర్వాత నవీన్‌ పొలిశెట్టి. జాతిరత్నాలు పడిపడి నవ్వి చూశాను. సిద్థూ జొన్నలగడ్డ, విష్వక్‌సేన్‌, అడివి శేష్‌ బాగా చేస్తారు. ఒకరి పేరు చెప్పమంటే మాత్రం సిద్థూ పేరు చెబుతాను
 
రష్మిక కంటే పూజా హెగ్డేతో పనిచేయడం ఇష్టమా?
నేను ఏ సినిమా చేస్తే .. ఆ చిత్రబృందం నా ఫేవరేట్‌. ప్రస్తుతం ‘పుష్ప 2’ చేస్తున్నా కాబట్టి రష్మికనే.

త్రివిక్రమ్‌ ఇష్టమా.. సుకుమార్‌ ఇష్టమా?
ప్రస్తుతం చేస్తున్న దర్శకుడు ఒకరు.. చేయనున్న దర్శకుడు ఒకరు. ఏ సినిమా చేస్తే. ఆ చిత్రబృందం నా ఫేవరేట్‌ అని. అందుకే సుకుమార్‌ అంటే ఇష్టం.

వారంతా చాలా స్పెషల్‌...
నేను చిన్నప్పుడు సరదాగా డ్యాన్స్‌ చేస్తుంటే రాఘవేంద్రరావు గారు రూ.100 ఇచ్చారు. నాకు ఫస్ట్‌ అడ్వాన్స్‌ ఇచ్చిన దర్శకుడు ఆయనే. ఆయన వందో సినిమాలో నేను హీరో. ఇప్పటికీ నా ఆఫీసులో ఆయన ఫొటో ఉంటుంది. నా రెండో సినిమా దిల్‌రాజుతో చేశాను. నా కెరీర్‌లో దిల్‌రాజు, సుకుమార్‌ ఇద్దరూ మంచి ఫౌండేషన్‌ వేశారు. నేను, గుణ్‌శేఖర్‌ కలిసి ‘వరుడు’ సినిమా చేశాం. దానికోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆ తర్వాత ఆయన లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేశారు. అందులో అతిథి పాత్రలో నటించడానికి ఏ హీరో రాకపోతే నేను చేశాను. ‘శాకుంతలం’లో మా అమ్మాయిని కూడా చూపించారు. ఇక తివిక్రమ్‌ నాకు మూడు హ్యాట్రిక్‌ విజయాలు అందించారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వీళ్లందరి సహకారమే కారణం.

Updated Date - Nov 15 , 2024 | 09:49 PM