The Greatest of All Time: విజిలేస్కో... ఫుట్‌ ట్యాపింగ్‌ సాంగ్‌!

ABN , Publish Date - Jul 13 , 2024 | 12:30 PM

విజయ్‌ (Vijay) హీరోగా, వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్  ఇండియా సినిమా 'ది గోట్‌’(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌- The Goat). ఎజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్  శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

విజయ్‌ (Vijay) హీరోగా, వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్  ఇండియా సినిమా 'ది గోట్‌’(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌- The Goat). ఎజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్  శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. శుక్రవారం ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి  సాహిత్యం అందించిన ఈ పాటను యువన్‌ శంకర్‌ రాజా(Yuvan Shankar raja), నకాష్‌ అజీజ్‌ వారి ఎనర్జిటిక్‌ వోకల్స్‌తో ఎక్స్‌ట్రా ఎనర్జీని యాడ్‌ చేశారు. పవర్‌ ఫుల్‌ ఎనర్జీతో డ్యాన్స్‌ అంథమ్‌గా ట్రాక్‌ స్పార్క్లింగ్‌ ఎట్మాస్పియర్‌ని క్రియేట్‌ చేసి లిజనర్స్‌కి ఫుట్‌ ట్యాపింగ్‌ నెంబర్‌గా అలరించింది. లిరికల్‌ వీడియోలో ప్రభుదేవా, ప్రశాంత్‌, అజ్మల్‌ అమీర్‌లతో కలిసి విజయ్‌ డ్యాన్స్‌ అదరగొట్టారు. రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు. కంప్లీట్‌ విజువల్స్‌తో పాటను చూసినప్పుడు మరింత ఇంపాక్ట్‌గా ఉండబోతోంది. 

విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్‌, ప్రభుదేవా, మోహన్‌, జయరామ్‌, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, వైభవ్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎజిఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్‌ అఘోరమ్‌, కల్పాతి ఎస్‌ గణేష్‌, కల్పాతి ఎస్‌ సురేష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సిద్థార్థ నుని సినిమాటోగ్రఫీ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెలుడులో విడుదల చేయనుంది. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. 

Updated Date - Jul 13 , 2024 | 12:45 PM