Vikram: విజయవాడలో 'తంగలాన్' టీమ్‌ సందడి!

ABN , Publish Date - Aug 12 , 2024 | 04:26 PM

'తంగలాన్' (Thangalaan) టీమ్‌ విజయవాడలో సందడి చేసింది. అక్కడ పేరొందిన బాబాయ్‌ హోటల్‌లో చిత్ర బృందం టిఫిన్  చేసారు. కాసేపు అక్కడున్న ప్రేక్షకులతో ముచ్చటించారు.


'తంగలాన్' (Thangalaan) టీమ్‌ విజయవాడలో సందడి చేసింది. అక్కడ పేరొందిన బాబాయ్‌ హోటల్‌లో చిత్ర బృందం టిఫిన్  చేసారు. కాసేపు అక్కడున్న ప్రేక్షకులతో ముచ్చటించారు. చియాన్  విక్రమ్‌(Vikram) హీరోగా నటించిన సరికొత్త  'తంగలాన్' . మాళవిక మోహనన్‌ (Malavika mohanan) కథానాయిక. హిస్ట్టారికల్‌ ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా పా.రంజిత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్సలో బిజీగా ఉంది చిత్ర బృందం. తంగలాన టీమ్‌ విజయవాడలో సందడి చేసింది. సోమవారం ఉదయం విజయవాడ చేరుకున్న చిత్రబృందం అక్కడ పేరొందిన బాబాయ్‌ హోటల్‌లో టిఫిన్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Thangala-n.jpg
కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా.రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రధారులు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి కలిగించాయి. ఈ సినిమా గురించి విక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ నేను చాలా చిత్రాల్లో నటించా. ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదు. ఇదొక విభిన్నమైన కథ. ఇందులో గ్లామర్‌కు చోటులేదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు మరో ప్రపంచం లోకి వెళ్లినట్లు అనిపిస్తుంది’ అని చెప్పారు. (Promotions at Babai Hotel)

Updated Date - Aug 12 , 2024 | 04:26 PM