Vijay Sethupathi: రామ్‌ చరణ్‌కి అందుకే నో చెప్పా...

ABN , Publish Date - Dec 16 , 2024 | 11:13 AM

‘ఉప్పెన’లో హీరోయిన్‌ తండ్రి రాయణం పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Setupathi). దాంతో, ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu).. విజయ్‌కు మరో అవకాశం ఇచ్చారని కొన్ని నెలల కిత్రం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే


‘ఉప్పెన’లో హీరోయిన్‌ తండ్రి రాయణం పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Setupathi). దాంతో, ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu).. విజయ్‌కు మరో అవకాశం ఇచ్చారని కొన్ని నెలల కిత్రం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌సీ 16'లో (Rc16) సేతుపతి కీ రోల్‌ చేస్తున్నారనేది ఆ వార్తల సానంశం, తాజాగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో  ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు రామ్‌ చరణ్‌ మూవీలో నటించట్లేదని స్పష్టం చేశారు  విజయ్‌ సేతుపతి. ఇప్పుడు ఆ సినిమాలో నటించే సమయం లేదని వివరించారు.


డైరెక్ట్‌ తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తారా? అని అడగగా.. చాలా కథలు వింటున్నానని, ఏదైనా స్టోరీ బాగుంటే అందులోని హీరో క్యారెక్టర్‌ నచ్చడం లేదన్నారు. త్వరలోనే ఓ సినిమా సెట్‌ అయ్యే అవకాశాలున్నాయని అన్నారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ మరువలేనని అన్నారు.  


విజయ్‌ సేతుపతి ‘విడుదల 2’తో మరోసారి తెలుగు ప్రేక్షకులును పలకరించనున్నారు. విజయ్‌ సేతుపతి, సూర్య, దర్శకుడు వెట్రిమారన్‌ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో మంజూ వారియర్‌ కీలక పాత్రలో కనిపిస్తోంది. ిఈ సినిమా ఈ నెల 20న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో విజయ్‌, మంజు వారియర్‌ ఆదివారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. 

Updated Date - Dec 16 , 2024 | 11:25 AM