BigBossSeason8: ‘బిగ్‌ బాస్‌-8’ త‌మిళ్‌.. హోస్ట్‌గా విజయ్‌ సేతుపతి! ప్రోమో రిలీజ్‌

ABN , Publish Date - Sep 08 , 2024 | 06:56 PM

బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ పొందిన ‘బిగ్‌ బాస్‌’ తమిళ రియాలిటీ షో ఎనిమిదో సీజన్‌కు ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు.

vijay sethupathi

బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ పొందిన ‘బిగ్‌ బాస్‌’ తమిళ (Big Boss Season8) రియాలిటీ షో ఎనిమిదో సీజన్‌కు ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గత ఏడు సీజన్‌లకు హోస్ట్‌గా వ్యవహరించిన విశ్వనటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) తన బిజీ షెడ్యూల్‌ కారణంగా ఎనిమిదో సీజన్‌ నుంచి తప్పుకున్నారు. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌ నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నాను అంటూ గత నెల 8వ తేదీ ట్వీట్‌ చేశారు. దీంతో తదుపరి హోస్ట్‌ ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

kamal

ఈ నేపథ్యంలో తొలుత సూర్య, శింబు, శివకార్తికేయన్‌ పేర్లు తెరపైకి రాగా చివ‌ర‌కు విజయ్‌ సేతుపతిని (Vijay Sethupathi) ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఇందులో బిగ్‌ బాస్‌ లోగోతో కూడిన సూట్‌తో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) చీకట్లో నడుచుకుంటూ వస్తుంటారు. అయితే, ఈ ఎనిమిదో సీజన్‌ ఎపుడు ప్రారంభమవుతుంది, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌ ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Updated Date - Sep 08 , 2024 | 06:56 PM