Vijay: టీవీకే పార్టీ మొదటి సమావేశం.. విజయ్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌

ABN , Publish Date - Oct 27 , 2024 | 07:58 PM

నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు.  కానీ, పాలిటిక్స్‌ విషయంలో భయపడడం లేదు అన్ని ఆలోచించే ఇక్కడికి వచ్చాను.. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.   ప్రతిదీ, ప్రతి ఒక్కరికీ అనే నినాదంతో  ముందుకు.. 

నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. 

కానీ, పాలిటిక్స్‌ విషయంలో భయపడడం లేదు

అన్ని ఆలోచించే ఇక్కడికి వచ్చాను.. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.  

ప్రతిదీ, ప్రతి ఒక్కరికీ అనే నినాదంతో  ముందుకు..   

పొత్తు అంటే.. వారికి అధికారంలో భాగస్వాముల్ని చేస్తాం 

-తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ (VIjay)

‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్‌ విషయంలో భయపడడం లేదు’’ అని నటుడు విజయ్‌ అన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం పార్టీ (Tamizhaga Vetri Kazhagam party) మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ "సినీ రంగంతో పోలిేస్త రాజకీయ రంగం చాలా సీరియస్‌. ద్రవిడ జాతీయవాదం, తమిళ జాతీయ వాదాన్ని వేరు చేయబోం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లులాంటివి. లౌకిక, సామాజిక న్యాయ సిద్థాంతాలే మా భావజాలం. దాని ఆధారంగానే పని చేస్తాం. రాజకీయాల్లో జయాపజయాలకు సంబంధించిన స్టోరీలు చదివాక  నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై విశ్వాసాన్ని ఉంచి, అన్ని ఆలోచించే ఇక్కడికి వచ్చాను. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. రాజకీయాల్లో పిల్లలమంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం రాజకీయంతో ఆడుకునే పిల్లలం. పెరియార్‌ ఈవీ రామస్వామి, కె.కామరాజ్‌, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, వేలు నాచియార్‌, అంజలి అమ్మాళ్‌ ఆశయాలతో పార్టీని నడిపిస్తాం. ప్రతిదీ, ప్రతి ఒక్కరికీ అనే నినాదంతో  పార్టీ పనిచేస్తుంది.. వన్‌ కమ్యూనిటీ, వన్‌ గాడ్‌ అనే సిద్థాంతంతో  పార్టీ ముందుకు వెళ్తుందని విజయ్‌ స్పష్టం చేశారు. ‘రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం. ఒకవేళ ఏవైనా పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకుంటే.. వారికి అధికారంలో భాగస్వాముల్ని చేస్తాం’’ అన్నారు.


Vijay.jpg

భారతీయ జనతా పార్టీ నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందని విజయ్‌ విమర్శించారు. డీఎంకే ద్రవిడియన్‌ నమూనాపైనా విరుచుకుపడ్డారు. తన రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆయన.. అరియాలూరులో నీట్‌ విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఆ పరీక్షపై తన వ్యతిరేక వైఖరిని ఈ సందర్భంగా ప్రకటించారు. సినిమా ఆర్టిస్ట్‌ అంటూ పలువురు చేస్తున్న విమర్శలకు బదులిచ్చారు విజయ్‌. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ పేర్లను ప్రస్తావించారు.

Amma.jpg

Updated Date - Oct 27 , 2024 | 08:37 PM