The Greatest of All Time: డ్యూయల్‌ రోల్‌ అదిరింది!

ABN , Publish Date - Jun 22 , 2024 | 10:21 AM

విజయ్‌ హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). మీనాక్షీ చౌదరి కథానాయిక. శనివారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

The Greatest of All Time: డ్యూయల్‌ రోల్‌ అదిరింది!


విజయ్‌ (Vijay) హీరోగా వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌-Goat). మీనాక్షీ చౌదరి (Meenakshi Choudary) కథానాయిక. శనివారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. డైలాగ్స్‌ ఏమీ లేకుండా కేవలం యాక్షన్  సన్నివేశాలనే చూపిస్తూ తీర్చిదిద్దిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. బైక్‌పై పోరాటాలు చేస్తూ విజయ్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించారు. ఆ లుక్స్‌ చూస్తుంటే థియేటర్‌లో విజిల్స్‌ మోత మోగేలా ఉంది. విజయ్‌ డబుల్‌ రోల్‌లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. '


Vijay a.avif
ఈ చిత్రంలో విజయ్‌ తండ్రి పాత్రతోపాటు, 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తారు. దాని కోసం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. దీనికి కోసం అమెరికాలో ఓ ప్రసిద్ధ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో వర్క్‌ చేయిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్‌ పతాకంపై కల్పాతి ఎస్‌.అగోరం, కల్పాతి ఎస్‌. గణేష్‌, కల్పాతి ఎస్‌.సురేష్‌ నిర్మిస్తున్నారు. యువన శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. సైంటిఫిక్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Updated Date - Jun 22 , 2024 | 10:24 AM