Vanitha Vijaykumar: నా తండ్రి ఆయనే అని ప్రపంచానికి తెలుసు!
ABN , Publish Date - Feb 25 , 2024 | 01:25 PM
తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తలో ఉంటారు నటి వనితా విజయ్ కుమార్. సినిమాల కంటే వ్యక్తిగత విషయాల వల్లే ఎక్కువగా ఆమె పాపులర్ అయింది. తమిళనటుడు విజయ్ కుమార్ వారసురాలిగా చంద్రలేఖ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత
తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తలో ఉంటారు నటి వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay kumar). సినిమాల కంటే వ్యక్తిగత విషయాల వల్లే ఎక్కువగా ఆమె పాపులర్ అయింది. తమిళనటుడు విజయ్ కుమార్ (Vijay kumar) వారసురాలిగా చంద్రలేఖ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత. తర్వాత దేవి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. మంచి చిత్రాలతో బిజీగా ఉన్న సమయంలో 2000లో నటుడు ఆకాష్‌ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఏడాదికే ఆకాశ్‌కు విడాకులు ఇచ్చి.. వ్యాపారవేత ఆనంద్‌ను పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. ఆ తర్వాత పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని.. అతన్ని దూరం పెట్టింది. గతేడాది మే నెలలో పీటర్ మృతి చెందగా.. అతను తన భర్తే కాదని, తమకు పెళ్లే జరగలేదని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వనితా తన ఇద్దరి కూతుళ్లతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. విజయ్‌కుమార్ ఫ్యామిలీ ఆమెను దూరం పెట్టింది.
ఇటీవల విజయ్ కుమార్ మనువరాలు దియా పెళ్లి జరిగింది. ఆ వేడుకకు విజయ్ కుమార్ ఇద్దరు భార్యల పిల్లలు, బంధువులు హాజరయ్యారు. కానీ వనితకు మాత్రం ఆహ్వానం అందలేదట. ఆ విషయంలో ఆమె హర్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది. తన తండ్రి గురించి వనితా విజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. ‘మా నాన్న ఓ ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి మాట్లాడుతూ.. నా పేరు తప్ప అందరి పేర్లు చెప్పాడు. నా పేరు చెప్పడానికి కూడా ఆయనకు ఇష్టం లేదు. ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా.. నేను మాత్రం ఆయన కూతురినే అనే విషయం ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం నా జీవితం ఇలా అయిందంటే.. అందుకు కారణం మా నాన్న. ఆయన వల్లే నా జీవితం నాశనం అయింది. ఆయన మాటలు వినడం వల్లే నేను ఇలా తయారయ్యాను’ అని వనితా కుమార్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో కూడిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.