Thangalaan: ఈ సారైనా ముహూర్తం కుదురుతుందా?

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:24 PM

విక్రమ్‌ (Vikram) హీరోగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan) పా.రంజిత్ (Pa Ranjith) దర్శకుడు.

Thangalaan: ఈ సారైనా ముహూర్తం కుదురుతుందా?

విక్రమ్‌ (Vikram) హీరోగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan) పా.రంజిత్ (Pa Ranjith) దర్శకుడు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌, నీలమ్‌ ప్రొడక్షన్స్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రం నిర్మించారు. ‘తంగలాన్‌ ’ సినిమాను మొదట జనవరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దాంతో ఏప్రిల్‌కు వాయిదా పడింది. గ్రాఫిక్స్‌ తదితర పనుల వల్ల  అప్పుడు విడుదలకు నోచుకోలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌ చేేసందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. మరి ఈసారైనా విడుదలకు నోచుకుంటుందో లేదో చూడాలి. (Thangalaan Release Date)

ప్రయోగాలకు వెనకాడని విక్రయ్‌ ఈ చిత్రం కోసం పెద్ద సాహసమే చేశారు. డీ గ్లామర్‌ పాత్రలో మొత్తం మేకోవర్‌ మార్చేశారు. గతంలో కూడా ఆయన ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు. మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - Jun 17 , 2024 | 12:55 PM