Thangalaan: ఉత్తర భారత దేశానికి బంగారు వీరుడు
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:55 PM
కోలీవుడ్ నటుడు చియాన విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు ప్రధాన పాత్రల్లో పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్. ఈ చిత్రాన్నిఆగస్టు 30న హిందీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు
కోలీవుడ్ నటుడు చియాన విక్రమ్(Chiyan Vikram), మాళవిక మోహనన్(Malavika Mohanan), పార్వతి తిరువొత్తు ప్రధాన పాత్రల్లో పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్' (Thangalaan). ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని హిందీ మార్కెట్‌లోనూ విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఈ మేరకు ఆగస్టు 30న దీనిని హిందీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని దర్శకుడు పా.రంజిత్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక ఒక పోస్టర్ విడుదల చేశారు. ‘‘బంగారు వీరుడు ఉత్తర భారత దేశానికి ఆగస్టు 30న వస్తున్నాడు. ఈ ఎపిక్ స్టోరీని చూసి ఆనందించేందుకు సిద్థంగా ఉండండి’’అంటూ క్యాప్షన్‌ని జత చేశారు.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. బ్రిటీష్‌వారు కోలాల్ గోల్ ఫీల్డ్స్ గురించి తెలుసుకుని తమ ప్రయోజనాల కోసం బంగారాన్ని ఎలా దోచుకుంటారు అనే అంశాలు చుట్టూ కథ నడుస్తుంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వేపూరు గ్రామంలో ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి జీవిస్తాడు. అతనొక రైతు. తనకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఆ అడవిలో ఉన్న బంగారాన్ని నాగజాతికి చెందిన ఆరతి(మాళవిక మోహనన్) అతీంద్రియ శక్తులతో రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలో కనిపిస్తుంటుంది. ఆమెను ఒక వ్యక్తి చంపినట్టు కలలో కనిపిస్తుంది. నిజంగా ఆరతి ఉందా? ఆమె అడవిలో ఉన్న బంగారాన్ని రక్షిస్తోందా? ఆంగ్లేయులతో కలిసి బంగారాన్ని వెలికి తీేసందుకు వెళ్లిన తంగలాన్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? మొదలైన ఆసక్తికర అంశాలతో ఈ కథ సిద్థమైంది. ఆగస్ట్ 15న దక్షిణాదిలో విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.