తెలుగులో రాష్ట్రాల్లో భారీ స్థాయిలో.. విజయ్ సేతుపతి 'మహారాజ'

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:29 PM

విజయ్ సేతుపతి 50వ మైల్ స్టోన్ మూవీ మహారాజ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ చిత్రంపై అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ సినిమా జూన్ 14న థియేట‌ర్‌ రిలీజ్‌కి సిద్ధమౌతున్న నేపథ్యంలో తెలుగు నాట ప్రమోషన్స్ మొదలయ్యాయి.

తెలుగులో రాష్ట్రాల్లో భారీ స్థాయిలో.. విజయ్ సేతుపతి  'మహారాజ'
maharaja

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ మహారాజ (Maharaja) విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. నితిలన్ సామినాథన్ (Nithilan Saminathan) దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ (Passion Studios), ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) పవర్ ఫుల్ రోల్ లో నటించారు. విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడంతో అత‌నికి మెమరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కేర్ తీసుకోగా నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

GPUK2IxW8AAzff9.jpeg

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ చిత్రంపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. అదేవిధంగాఈ సినిమా జూన్ 14న థియేట‌ర్‌ రిలీజ్‌కి సిద్ధమౌతున్న నేపథ్యంలో తెలుగు నాట కూడా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్ ని దక్కించుకోగా. ఏపీ, తెలంగాణలలో ఈ 'మహారాజ' (Maharaja) సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


GOql72-aUAAfomX.jpeg

అభిరామి (Abhirami), మ‌మ‌తా మోహ‌న్‌దాస్ (Mamta Mohandas), భారతీరాజా, నటరాజన్ సుబ్రమణ్యం, సింగంపులి, బాయ్స్ మణికందన్, కల్కి, సచన నమిదాస్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ, బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండ‌గా ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ‌య్వ‌హ‌రిస్తున్నారు.

Updated Date - Jun 06 , 2024 | 04:29 PM