UI The Movie: ‘యూఐ’ మూవీ ఫ్రూట్ సలాడ్ వంటిది
ABN , Publish Date - Dec 19 , 2024 | 04:59 PM
‘యూఐ’ చిత్రం ఫ్రూట్ సలాడ్ వంటిదని అన్నారు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. ఆయన హీరోగా నటించిన ‘యూఐ’ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. యూనిట్ చిత్ర ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో ఉపేంద్ర ఏమన్నారంటే..
తాను హీరోగా నటించిన ‘యూఐ’ చిత్రం ఫ్రూట్ సలాడ్ వంటిదని, ఇందులో అభిమానులు ఆశించే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ చిత్ర హీరో ఉపేంద్ర అన్నారు. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ సంయుక్తంగా జి.మనోహరన్, శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. ఉపేంద్ర, రేష్మ హీరో హీరోయిన్లు. రవి శంకర్, సాధు కోకిల తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్ర బృందం చెన్నై నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
Also Read- Sandhya Theatre Stampede: శ్రీతేజ్‌ను పరామర్శించిన సుకుమార్.. ఏమన్నారంటే
ఈ సమావేశంలో హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ట్రైలర్‌లోనే అనేక భిన్నమైన అంశాలు చూశారు. అన్ని రకాలైన కమర్షియల్ హంగులున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇదొక ఫ్రూట్ సలాడ్ లాంటి సినిమా. ఈ సినిమాకు నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తుంది. ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కొత్త సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇది ఒక ఇమేజినరీ వరల్డ్‌లా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అజినీస్ లోక్‌నాధ్, ఆర్ డైరెక్టర్ శివకుమార్, కెమెరామెన్ వేణు- ప్రజ్వల్, ఫైట్ మాస్టర్స్ రవివర్మ- థ్రిల్లర్ మంజు ఇలా అందరూ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. రేష్మ ఎక్స్‌ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేసింది. ఆడియన్స్ మీద కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమాని చేశానని తెలిపారు.
హీరోయిన్ రేష్మ మాట్లాడుతూ.. సినిమా ప్రమోషన్ కోసం తొలిసారి చెన్నై రావడం ఆనందంగా ఉంది. నా పాత్ర గురించి, ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడలేను. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా సర్‌ప్రైజ్ ఇస్తుందని పేర్కొన్నారు.
మాటల రచయిత మదన్ కార్కి మాట్లాడుతూ.. తాను ఏది తీసుకున్నా ప్రత్యేకంగా రూపొందించడానికి ఉపేంద్ర వెనుకాడరు. ఈ చిత్ర కథాంశం అంత విలక్షణంగా ఉంటుందని తెలపగా.. నిర్మాత సమీర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మా అందరికి ఓ పెద్ద కల. ఈ కథను ఏ ఒక్క జోనర్‌కు పరిమితం చేయకూడదు. టెక్నీషియన్స్ ఎంతో శ్రమించారని చెప్పుకొచ్చారు.