Thalapathy 69: విజయ్ 69, డీవీవీ మూవీ అటకెక్కిన‌ట్టేనా?

ABN , Publish Date - Jun 21 , 2024 | 10:42 AM

త‌మిళ‌ అగ్ర హీరో విజయ్ న‌టించాల్సిన‌ 69వ చిత్రం ఇప్ప‌ట్లో లేనట్టేనని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి కారణం వచ్చే 2026లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పోటీ చేయనుంది.

Thalapathy 69: విజయ్ 69, డీవీవీ మూవీ అటకెక్కిన‌ట్టేనా?
vijay

త‌మిళ‌ అగ్ర హీరో విజయ్ (Vijay) న‌టించాల్సిన‌ 69వ చిత్రం (#Thalapathy69) లేనట్టేనని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి కారణం వచ్చే 2026లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పోటీ చేయనుంది. దీంతో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో విజయ్‌ ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు సమాచారం. అందుకే తన 69వ (#Thalapathy69) చిత్రాన్ని పక్కనబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ ప్రాజెక్టుకు ‘చదురంగ వేట్టై’, ‘ధీరన్‌ అధికారం ఒండ్రు’, ‘నేర్‌ కొండ పార్వై’, ‘వలిమై’, ‘తుణివు’ వంటి వరుస హిట్‌ చిత్రాలను అందిస్తూ, సూపర్‌ హిట్‌ డైరెక్టరుగా గుర్తింపు పొందిన హెచ్‌.వినోద్ (HVinoth) డైరెక్ట్‌ చేస్తారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం తన 68వ చిత్రం ‘గోట్‌’ (The Greatest Of All Time) మూవీని వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలన్న తలంపులో ఉన్నట్టు సమాచారం.

GQdJ_OQbIAAro3H.jpeg


ఇందుకోసం ఇప్పటి నుంచే రాష్ట్రస్థాయి పర్యటనలు, మహానాడు, గ్రామ, జిల్లా స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, నేతలు, కార్యకర్తలతో సమాలోచనలు, బహిరంగ సభలు వంటి వాటితో క్షణం తీరికలేకుండా గడపాల్సి ఉన్నందున 69వ (#Thalapathy69) ప్రాజెక్టును తాత్కాలింగా పక్కనబెట్టాలని విజయ్ (Vijay) ఆలోచన చేస్తున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ క‌థానాయికగా సెల‌క్ట్ చేశార‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. కాగా ఈసినిమాను తెలుగు బ‌డా నిర్మాణ సంస్థ డీవీవీ బ్యాన‌ర్‌లో నిర్మించ‌నున్న‌ట్లు వార్త‌లు బాగా ప్ర‌చారం అయ్యాయి.

Updated Date - Jun 21 , 2024 | 03:31 PM