Ameer: గుజ‌రాత్‌తో పోలిస్తే త‌మిళ‌నాడులో శాంతిభద్రత‌లు బెట‌ర్‌: దర్శకుడు అమీర్‌

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:42 PM

గుజ‌రాత్‌తో పోలిస్తే త‌మిళ‌నాడులో శాంతిభద్రత‌లు బెట‌ర్ అని దర్శకుడు అమీర్ అన్నారు. తాజాగా ఓ సినిమా ఫంక్ష‌న్ లో పాల్గొన్న ఆయ‌న తాజా త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ స‌మ‌స్య గురించి మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

ameer

కల్తీసారా మరణాలు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్యను కారణంగా చూపి రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని చెప్పలేమని సినీ దర్శకుడు అమీర్ (Ameer) అన్నారు. నగరంలో జరిగిన ‘యోలో’ చిత్ర ప్రారంభోత్సంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్‌ కల్చర్‌ పెరిగిపోతుంది.

ఒక్క తమిళనాడులోనే మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నాయని చెప్పడం ఒక రకమైన రాజకీయమే. దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా గుజరాత్‌ రాష్ట్రంలోని ఓడరేవుల్లో టన్నుల కొద్దీ డ్రగ్స్‌ దిగుమతవుతున్నాయి. వీటిన్నింటితో పోల్చితే మన రాష్ట్రంలో శాంతిభద్రలు కొంతమేరకు అదుపులోనే ఉన్నాయనే చెప్పొచ్చు.


amee.jpg

రాష్ట్రంలో పటిష్ఠమైన శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. గతంలో కూడా రాజీవ్‌ గాంధీ, పళనిబాబా వంటి పలువురు హత్యకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు జరిగి ఉండకూడదు. అలాగే, కల్తీ సారా తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించడాన్ని నేను ఏకీభవించను.

అయితే, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లను ప్రభుత్వం ఆదుకోవాలి. కల్తీసారా తాగి అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వివిధ రాజకీయ పార్టీల నేతలు పరామర్శించడం కూడా సమంజసం కాదు. కల్తీసారా సేవించకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 12:42 PM