Veerayi Makkal: తమిళ చిత్ర పరిశ్రమకు ఇలాంటి సినిమాలు అవసరం

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:56 PM

గ్రామీణ ప్రజల నిజజీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం ‘వీరాయి మక్కల్‌’ . త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్‌ దర్శకుడు పేరరసు మాట్లాడుతూ..

Veerayi Makkal

గ్రామీణ ప్రజల నిజజీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం ‘వీరాయి మక్కల్‌’ (Veerayi Makkal). ఏ వైట్ స్క్రీన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మాత ఎన్‌.సురేష్‌ నిర్మాణంలో నాగరాజ్‌ కరుప్పయ్య (nagaraj Karuppaih) దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్‌ దర్శకుడు పేరరసు (Perarasu) మాట్లాడుతూ.. ‘తమిళ చిత్ర పరిశ్రమకు ఇలాంటి సినిమాలు అవసరం. ఇలాంటి మూవీలు చూడడం అరుదు. ఇపుడు వచ్చే సినిమాల్లో మానవ సంబంధాలు చూపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాను నిర్మించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి కంటెంట్‌తో వచ్చే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు.


F7-ZYzxbcAAP1vC.jpeg

దర్శకుడు నాగరాజ్‌ కరుప్పయ్య (nagaraj Karuppaih)మాట్లాడుతూ.. ‘నేను పుట్టి పెరిగిన ప్రేమ, కోపం, జీవితం వంటి అంశాలతో రూపొందించా. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఏడేళ్ల తర్వాత తొలిసారి దర్శకుడిగా అవకాశం లభించింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మారిముత్తు నటన చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన నటనతో పాటు సినిమా స్టోరీ కూడా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది’ అని పేర్కొన్నారు.

కాగా, ఈ మూవీలో వేల రామమూర్తి (Vela Ramamoorthy), దివంగత మారిముత్తు (mari muthu), దీపా శంకర్‌, సురేష్‌ నందా, నందన, రమా, పాండి అక్కా తదితరులు నటించారు. దీపన్‌ చక్రవర్తి సంగీతం అందించారు.

Updated Date - Jul 24 , 2024 | 04:56 PM