Bharathiraja: దర్శకుడు బాలచందర్ విగ్రహం ఏర్పాటు చేయండి: భారతీరాజా
ABN , Publish Date - Jul 12 , 2024 | 12:25 PM
దిగ్గజ దర్శకుడు దివంగత కె.బాలచందర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని సినీ దర్శకుడు భారతీరాజా కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు.
దిగ్గజ దర్శకుడు దివంగత కె.బాలచందర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని సినీ దర్శకుడు భారతీరాజా (Bharathiraja )కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. కె.బాలచందర్ (K. Balachander) 94వ జయంతి వేడుకలు కె.బాలచందర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఆళ్వార్‌పేట సీతమ్మాళ్ కాలనీలో ఉన్న రాజ్ కమల్ ఫిల్మ్ కార్యాలయంలో జరిగాయి.
ఈ వేడుకలను సీనియర్ దర్శకుడు భారతీరాజా, మైలాపూర్ ఎమ్మెల్యే టి.వేలు, నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీరాజా మాట్లాడుతూ, ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆస్పత్రి సమీపంలో వెయ్యి అడుగుల విస్తీర్ణంలో కెబీ స్క్వేర్ ఏర్పాటు చేసి, అక్కడ బాలచందర్ (K. Balachander) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రికి విఙ్ఞప్తి చేశారు.
మరోవైపు తన గురువు కె.బాలచందర్ జయంతిని పురస్కరించుకుని విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జీవితంలో నిబద్ధతో ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పించిన వ్యక్తి బాలచందర్ (K. Balachander) అని అన్నారు. థ్యాంక్యూ కేబీ సర్ అంటూ అందులో పేర్కొన్నారు.