Rajinikanth: సెట్స్‌పైకి ‘కూలీ’.. 10 రోజుల పాటు హైదరాబాద్‌లోనే..
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:20 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కూలీ’ చిత్రం షూటింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ పది రోజుల పాటు కంటిన్యూగా జరగనుంది. ఆ తర్వాత చెన్నైలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించేలా ప్లాన్ చేశారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించనున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కూలీ’ (Coolie) చిత్రం షూటింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ పది రోజుల పాటు కంటిన్యూగా జరగనుంది. ఆ తర్వాత చెన్నైలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించేలా ప్లాన్ చేశారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించనున్నారు. ఇందులో సీనియర్ నటుడు సత్యరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. (Coolie Movie Shooting Started)
Also Read-Shyamala Devi: అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ప్రభాస్‌తో సినిమా చేయిస్తా..
రజనీ - సత్యరాజ్ కలిసి దాదాపు 38 యేళ్ళ తర్వాత నటించనున్నారు. ఇతర పాత్రల్లో శృతిహాసన్, ఫహాద్ ఫాజిల్, శోభన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తమే సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన స్నేహితుడు మోహన్ బాబు (Mohan Babu)తో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. వారిద్దరూ కలిసి వచ్చి కారెక్కిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే మంచు మోహన్ బాబు కూడా రజనీకాంత్‌తో ఉన్న ఫొటోని షేర్ చేసి.. వారి మధ్య స్నేహానికి ఉన్న గొప్పతనం చాటి చెప్పారు.
Read Latest Cinema News