Thug Life: ‘థగ్ లైఫ్’లో శింబు లుక్.. అరాచకం

ABN , Publish Date - May 08 , 2024 | 10:06 PM

‘విక్రమ్’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న ఉలగనాయకన్ కమల్ హాసన్ మరో క్రేజీ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘థగ్ లైఫ్’తో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మాగ్నమ్ ఓపస్‌ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో సిలంబరసన్ టిఆర్ (శింబు) ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా యాక్షన్ ప్యాక్డ్ టీజర్ షేర్ చేస్తూ శింబుని పరిచయం చేశారు మేకర్స్.

Thug Life: ‘థగ్ లైఫ్’లో శింబు లుక్.. అరాచకం
Silambarasan TR Look in Thug Life

‘విక్రమ్’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న ఉలగనాయకన్ కమల్ హాసన్ మరో క్రేజీ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘థగ్ లైఫ్’ (Thug Life)తో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మాగ్నమ్ ఓపస్‌ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. 1987లో వచ్చిన కమల్ హసన్, మణిరత్నం కల్ట్ ఫిల్మ్ ‘నాయకన్’ తర్వాత ఈ లెజండరీ ద్వయం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అద్భుతమైన తారాగణం, అగ్రశేణి సాంకేతిక నిపుణులతో ‘థగ్ లైఫ్’ హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరో సిలంబరసన్ టిఆర్ (శింబు) కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ టీజర్ షేర్ చేస్తూ శింబు (Silambarasan TR)ని పరిచయం చేశారు మేకర్స్.


Silambarasan-TR.jpg

ఈ టీజర్‌లో శింబు కార్‌లో దుమ్మురేపుతూ వచ్చి గన్‌ని గురిపెట్టడం పవర్ ఫుల్‌గా వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయన లుక్ అరాచకం అంతే. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్స్ పై ఆర్.మహేంద్రన్ శివ అనంత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ ఎంటర్ టైనర్‌కి ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. అన్‌బరివ్‌ స్టంట్ కొరియోగ్రాఫర్స్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, కమల్ హాసన్ లుక్‌లు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

Read Latest Cinema News

Updated Date - May 08 , 2024 | 10:06 PM