Singer: సంగీత దర్శకుడిని ముప్పతిప్పలు పెడుతోన్న సింగర్
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:03 AM
కాంట్రవర్సీ లేడీ సింగర్‌పై తాజాగా కోలీవుడ్ సంగీత దర్శకుడు సంచలన ఆరోపణలు చేశారు. తనతో ఆల్బమ్ చేసిన సింగర్.. ప్రమోషన్స్‌కు రాకుండా దురుసుగా వ్యవహరిస్తోందని ఆయన చేస్తోన్న ఆరోపణలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే..
సంగీత దర్శకుడు శక్తి ఆర్.సెల్వను గాయని సుచిత్ర ముప్పుతిప్పలు పెడుతున్నారు. సెల్వ - సుచిత్ర కలిసి రూపొందించిన ఒక ఆల్బమ్ ప్రచార కార్యక్రమాలకు రాకపోవడమే కాకుండా, తన ఫొటోను కూడా ఉపయోగించరాదని సుచిత్ర షరతు విధించారని శక్తి ఆర్ సెల్వ ఆరోపించారు. గత కొంతకాలంగా సుచీ లీక్స్ అంటూ సింగర్ సుచిత్ర పేరు వైరల్ అవుతూనే ఉంది. ఒకప్పుడు స్టార్ సింగర్‌గా దూసుకెళ్లిన సుచిత్ర జీవితం.. ప్రస్తుతం ఎలా తయారయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సింగర్‌కు మళ్లీ ఛాన్స్ ఇస్తే.. తనపట్ట దురుసుగా ప్రవర్తిస్తుందని సంగీత దర్శకుడు సెల్వ ఆరోపణలు చేస్తున్నారు.
Also Read-Allu Arjun: ఆర్మీ తెచ్చిన తంట.. అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘గాయని సుచిత్రతో కలిసి ‘టైటానిక్ సన్ని సన్ని’ అనే మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించాను. ఈ పాట ప్రమోషన్ కోసం ఆమె ఏమాత్రం సహకరించడం లేదు. పైగా రికార్డింగ్ సమయంలో నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బహిర్గతం చేశాను. మహిళల్లో తనకు మంచి పేరు ఉందని, అందువల్ల తన పేరు, ఫొటో ఎక్కడా ఉపయోగించడానికి వీల్లేదని ఆమె షరతు విధించారు. దివంగత కె.బాలచందర్, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, గేయ రచయిత వైరముత్తు వంటివారిపై అనేక అసత్య ఆరోపణలు చేసిన గాయని... ఇపుడు మాత్రం ఆమె నటించిన ఆల్బమ్ సాంగ్ గురించి ప్రమోషన్ చేయమంటే ససేమిరా అంటున్నారు. గత రెండేళ్ళుగా ఆమెకు ఎలాంటి అవకాశాలు లేవు. ఈ కారణంగానే ఆమె వాయిస్‌ను శ్రోతలకు వినిపించాలనే ఉద్దేశంతో ఈ ఆల్బమ్ రూపొందించాను. కానీ, సుచిత్ర ప్రమోషన్‌కు రాకపోవమేకాకుండా నా పట్ల దురుసుగా ప్రవర్తించారు’’ అని శక్తి ఆర్.సెల్వ ఆరోపించారు.
కాగా, హీరో కరణ్ నటించిన ‘కంద’ చిత్రానికి సంగీతం సమకూర్చిన సెల్వ.. అనారోగ్యం కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇపుడు మళ్ళీ మ్యూజిక్ ఆల్బమ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఆయన మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు. ఈ ఆల్బమ్ తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్న ఆయనకు సుచిత్ర రూపంలో ఇలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..
Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే
Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్షజ్ఞ'
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి