Red Flower: ‘రెడ్‌ ఫ్లవర్‌’.. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన‌ విజయ్‌ సేతుపతి

ABN , Publish Date - Jul 21 , 2024 | 06:54 PM

విఘ్నేష్ , మనీషా జష్నాని జంటగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘రెడ్‌ ఫ్లవర్‌’.ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి ఇటీవ‌ల‌ విడుదల చేశారు.

RedFlower

శ్రీకాళికాంబాల్‌ పిక్చర్స్‌ పతాకంపై కె.మాణిక్యం నిర్మించిన చిత్రం ‘రెడ్‌ ఫ్లవర్‌’(Red Flower). విఘ్నేష్ (Vignesh ), మనీషా జష్నాని జంటగా నటించే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీకి ఆండ్రూ పాండియన్ కథ సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించారు.

GGDmebWWwAAdqQP.jpegఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి ఇటీవ‌ల‌ విడుదల చేశారు. ఈ రొమాంటిక్‌ పోస్టరులో విఘ్నేష్‌ లుక్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.


కాంటెంపరరీ ఎలిమెంట్స్‌తో ఎల్లవేళలా ప్రేమనుపంచాలన్న కాన్సెప్టుతో భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందించారు.

GSm-Q8IXkAALwvb.jpeg

ఇతర పాత్రల్లో సీనియర్‌ నటులు నాజర్‌, వైజీ మహేంద్రన్‌, సురేష్‌ మేనన్‌, గోపి కన్నదాసన్‌, మోహన్‌ రామ్‌, డీఎం కార్తీక్‌, జాన్‌ విజయ్‌, అజయ్‌ రత్నం, లీలా శాంసన్‌, డీఎం కార్తీక్‌, తలైవాసన్‌ విజయ్‌ తదితరులు నటించారు.

Updated Date - Jul 21 , 2024 | 06:54 PM