VettaiyanVsKanguva: ‘వేట్టయాన్‌’తో ‘కంగువా’ పోటీ.. ఎవ‌రు నిలిచేనో

ABN , Publish Date - Jul 04 , 2024 | 02:22 PM

హీరో సూర్య న‌టించిన కొత్త‌ చిత్రం ‘కంగువా’. అక్టోబరు 10న రిలీజ్‌ చేయనున్నట్టు ఇటీవ‌ల ప్రకటించారు. అయితే అదే రోజున రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.దీంతో రెండు చిత్రాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మై పోటీ నెల‌కొంది.

VettaiyanVsKanguva

హీరో సూర్య (Suriya) దర్శకుడు చిరుత్తై శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘కంగువా’(Kanguva). దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబరు పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్టు ఇటీవ‌ల అధికారికంగా ప్రకటించారు.

GRF8ianb0AEB5AE.jpeg

అయితే అదే రోజున సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ‘వేట్టయాన్‌’ (Vettaiyan)చిత్రం కూడా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.దీంతో ఈ రెండు చిత్రాలు ఇపుడు దసరా రేసులో నిలబడడంతో ఇటు తలైవర్‌, అటు సూర్య (Suriya) అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.


కాగా, ‘కంగువా’ (Kanguva) చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌తో కలిసి బడా నిర్మాత కేఈ ఙ్ఞానవేల్‌ రాజా.... స్టూడియో గ్రీన్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో పదికిపైగా భాషల్లో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ నటి దిశా పఠానీ (Disha Patani) హీరోయిన్‌గా నటించగా బాంబీ డియోల్ (Bobby Deol), యోగిబాబు, రెడిన్‌ కింగ్‌స్లీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

Vettaiyan_poster.jpg

వెట్రి పళనిస్వామి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం. ఇందులో హీరో సూర్య రెండు పాత్రలను పోషించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. చూడాలి బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రిస్థితి ఎలా ఉంటుందో.

Updated Date - Jul 04 , 2024 | 02:57 PM