Rajinikanth: ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన సూపర్ స్టార్..

ABN , Publish Date - Oct 04 , 2024 | 05:29 PM

మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై.. చెన్నై గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకుని.. డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. డిశ్చార్జ్ అనంతరం రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. విషయం ఏంటంటే..

Rajinikanth and Prime Minister Modi

మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై.. చెన్నై గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో ఆస్పత్రి (Apollo Hospitals)లో చికిత్స తీసుకున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకుని.. డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో.. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ థ్యాంక్స్ చెప్పారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Also Read- Thalapathy 69: విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్‌లో ఏం జరిగిందో తెలుసా?


ట్విట్టర్ ‘ఎక్స్’ ద్వారా రజనీకాంత్ స్పందిస్తూ.. ‘‘నా హెల్త్ పట్ల ఎంతో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి.. ఫోన్ చేసి మరీ పరామర్శించిన ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi)కి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)కు, తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్‌కు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు కూడా ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అలాగే తన కోసం ప్రార్థించిన అభిమానులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రజనీకాంత్ చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


Rajini.jpg

అసలు విషయం ఏమిటంటే..

సూపర్ స్టార్ రజనీకాంత్ సెప్టెంబర్‌ 30న అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రజనీకాంత్‌ని పరీక్షించిన డాక్టర్లు.. ఆయన గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించి.. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. రజనీకాంత్ హెల్త్ సరికావడంతో ఉండటంతో ఆయనను గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. అయితే కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు రజనీకాంత్‌కు సూచించారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్‌’ సినిమా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. అయితే ప్రస్తుతం రజనీ ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం అయితే లేదు. రజనీ లేకుండానే ఇకపై ఈ సినిమా ప్రమోషన్స్ జరగనున్నాయి. టి.జె. జ్ఞానవేల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని పూర్తి చేసిన రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు.

Also Read- Samantha: కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ కౌంటర్

Also Read- Tollywood: సినిమాల కరువులో.. టాలీవుడ్ భామలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 04 , 2024 | 05:29 PM