Teenz Review: పిల్ల‌ల‌తో తీసిన‌.. సైన్స్‌ ఫిక్షన్ థ్రిల్ల‌ర్‌ ‘టీన్జ్‌’ ఎలా ఉందంటే?

ABN , Publish Date - Jul 19 , 2024 | 10:14 AM

వైవిధ్యభరితమైన కథా చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు, దర్శకనిర్మాత పార్తిబన్ తాజాగా బాల నటీనటులతో తెరకెక్కించిన చిత్రం ‘టీన్జ్ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Teenz

వైవిధ్యభరితమైన కథా చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు, దర్శకనిర్మాత పార్తిబన్ (Parthiban) తాజాగా బాల నటీనటులతో తెరకెక్కించిన చిత్రం ‘టీన్జ్ (Teenz) ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. యుక్త వయసులో ఉన్న నటీనటులతో ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ రూపొందించారు. డి.ఇమాన్ (D.IMMAN) సంగీతం అందించారు. అయితే, నేపథ్య సంగీతం బాగున్నప్పటికీ పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. జీసెస్‌ అంటూ సాగే పాట మాత్రమే బాగుందనిపిస్తుంది.

Teenz.jpg

యుక్తవయసు దాటిన తర్వాత బాలబాలికలు చేసే ప్రసంగాలు, వారి ప్రవర్తన, వీరి మధ్య చిన్నపాటి లవ్‌ ట్రాక్‌, ప్రేమ గీతాలు వంటివి బాగున్నాయి. అయితే, కొన్ని సన్నివేశాల్లో చిన్నారులుగా మద్యం సేవిస్తున్నట్టుగా చిత్రీకరించడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అదేసమయంలో ఒక సీన్‌ తర్వాత ఒక్కో నటుడు మాయమైపోవడం, చట్టుపక్కల వారి అరుపులు, కేకలు, ఏడుపులు, మధ్యమధ్యలో మళ్ళీ ప్రేమ సన్నివేశాలు వంటివి స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగేలా చేస్తుంది.


Teenz

ముఖ్యంగా చిన్నారులు సుధీర్ఘ సంభాషణలు, వారి సాహస యాత్రకు వెళ్ళేందుకు వారు తమ ఇళ్ళలోని పెద్దలకు చెప్పే కారణాలు ఏమాత్రం సరిపోలేదు. అలాగే, ఒక క్యారెక్టర్‌ను హైలెట్‌ చేసేందుకు ఇంగ్లీష్‌ డైలాగుల పరంపర, సుధీర్ఘమైన ఆంగ్ల పాటలు ఇలాంటివి ప్రేక్షకుడికి బోర్‌కొట్టేలా చేస్తాయి. మొత్తంమీద చిన్నారులతో ఒక దర్శకుడిగా పార్తిబన్ (Parthiban) చేసిన ఈ సైన్స్‌ఫిక్షన్‌ ప్రయోగం విఫలమైందని సినీ క్రిటిక్స్‌ అభిప్రాయ పడుతున్నారు.

Teenz

Updated Date - Jul 19 , 2024 | 04:55 PM