Prabhu Deva: శాండ్‌విచ్‌లో చిక్కుకున్న ప్రభుదేవా..

ABN , Publish Date - Jul 09 , 2024 | 12:23 PM

ప్రభుదేవా నటిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రానికి ‘జాలియో జింఖానా’ అనే టైటిల్‌ ఖరారు చేసి, తాజాగా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను గత యేడాది సెట్స్‌పైకి తీసుకెళ్ళారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ప్రభుదేవా శాండ్‌విచ్‌లో చిక్కుకుని ఉండగా, దాన్ని పలువురు నటీమణులు చేతులతో ఎత్తిపట్టుకునివుండేలా డిజైన్‌ చేశారు.

JollyO Gymkhana Movie First Look

ప్రభుదేవా (Prabhu Deva) నటిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రానికి ‘జాలియో జింఖానా’ (JollyO Gymkhana) అనే టైటిల్‌ ఖరారు చేసి, తాజాగా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. శక్తి చిదంబరం (Shakthi Chidhambaram) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను గత యేడాది సెట్స్‌పైకి తీసుకెళ్ళారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ప్రభుదేవా శాండ్‌విచ్‌లో చిక్కుకుని ఉండగా, దాన్ని పలువురు నటీమణులు చేతులతో ఎత్తిపట్టుకునివుండేలా డిజైన్‌ చేశారు. ఇందులో హీరోయిన్‌గా మడొన్నా సెబాస్టియన్‌ (Madonna Sebastian) నటించగా.. ఇతర పాత్రలలో అభిరామి, యోగిబాబు, రెడిన్‌ కింగ్‌స్లీ, రోబో శంకర్‌, సాయి దీనా, యాషికా ఆనంద్‌, మధుసూదన్‌ తదితరులు పోషించారు. (JollyO Gymkhana Movie First Look)

Also Read- Siddharth: సిద్ధార్ధ్.. నీ అతి తగ్గించుకుంటే మంచిది..


ఈ సినిమా వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. ‘‘ప్రభుదేవా నటిస్తున్న పూర్తి హాస్యభరిత చిత్రమిది. సినిమా ఆద్యంతం హీరో శవంలా నటిస్తారు. తెన్‌కాశికి చెందిన ఒక ఫ్యామిలీ ఈ శవాన్ని కొడైక్కెనాల్‌లో చేర్చాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ శవాన్ని తెన్‌కాశి నుంచి కొడైక్కెనాల్‌కు ఎలా తరలించారన్నది కడుపుబ్బ నవ్వించేలా హాస్యభరితంగా చిత్రీకరించాం. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ హాయిగా ఈ చిత్రాన్ని వీక్షించేలా చిత్రీకరించాము. నిర్మాణాంతర పనులన్నీ పూర్తి చేసి త్వరలోనే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


JollyO-Gymkhana.jpg

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రాన్స్‌ఇండియా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్‌ వినాయగమూర్తి సంగీతం అందిస్తున్నారు. ప్రభుదేవా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కొరియోగ్రఫీ, దర్శకత్వం కంటే నటనపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వరసగా చిత్రాలు చేస్తూ.. నటుడిగా తనేంటో నిరూపించుకుంటున్నారు. మధ్యమధ్యలో తన అవసరం ఉంది అనుకున్న చిత్రాలకు మాత్రమే ఆయన కొరియోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 09 , 2024 | 12:23 PM