Aalakaalam: మద్యపానంపై వైవిధ్యభరితంగా ‘ఆలకాలం’.. పాజిటివ్ టాక్
ABN , Publish Date - Apr 06 , 2024 | 08:26 PM
జయకృష్ణమూర్తి, చాందిని, ఈశ్వరీరావు, దీపా శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆలకాలం’ చిత్రం మద్యపానం ఇతివృత్తంతో తెరకెక్కి పాజిటివ్ స్పందనతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. మద్యపానం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుంది, కుటుంబాలు ఏ విధంగా చిన్నాభిన్నమైపోతాయన్న కథాంశంతో వైవిధ్యభరితంగా ఈ చిత్రం తెరకెక్కింది.
జయకృష్ణమూర్తి (Jaya Krishnamoorthy), చాందిని (Chandini Tamilarasan), ఈశ్వరీరావు (Easwari Rao), దీపా శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆలకాలం’ (Aalakaalam) చిత్రం మద్యపానం (Drinking Alcohol) ఇతివృత్తంతో తెరకెక్కి పాజిటివ్ స్పందనతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. మద్యపానం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుంది, కుటుంబాలు ఏ విధంగా చిన్నాభిన్నమైపోతాయన్న కథాంశంతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. కానీ, వీటికి భిన్నంగా వైవిధ్యభరితమైన కథాంశంలో ఈ సినిమాను దర్శకుడు జయకృష్ణమూర్తి (Jaya Krishnamoorthy) తెరకెక్కించారు. శ్రీ జయ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం ఎన్.ఆర్.రఘునందన్.
*Bharateeyudu2: అఫీషియల్.. డేట్ చెప్పలేదు కానీ.. ‘భారతీయుడు 2’ విడుదల ఎప్పుడో చెప్పారు
అనేక చిత్రాల్లో మద్యపానం సేవించడాన్ని ఒక వినోదాంశంగా చూపిస్తుంటారు. అయితే ఈ సినిమాలో మద్యం మనిషిని ఎంతటి స్థాయికి దిగజార్చుతుందనే విషయాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్టు వివరించారు. హీరోయిన్ చాందిని కాలేజీ విద్యార్థినిగా పాత్రలో ఒదిగిపోయారు. సీనియర్ నటి ఈశ్వరీ రావు పాత్ర, నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో తల్లిగా అద్భుతంగా నటించారు. మద్యానికి బానిసై తన భర్తను కోల్పోయిన ఆమె.. కుమారుడు కూడా అదే మద్యానికి బానిస కావడాన్ని జీర్ణించుకోలేక, తిరిగి మామూలు మనిషిని చేసేందుకు ఆమె పడే తపన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించేలా ఉంటుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. (Positive Talk to Aalakaalam)
ఇవి కూడా చదవండి:
====================
*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..
*************************
*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..
***********************