Perarasu: అజిత్‌, విజయ్‌లను.. స్టార్‌ హీరోలుగా తయారు చేసింది ఆయనే

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:28 PM

కొత్త నటీనటులతో త‌మిళంలో కొత్త‌గా కమర్షియల్‌ థ్రిల్లర్‌ హర్రర్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘పి2 ఇరువర్‌’. తాజాగా ఆడియో, ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా తమిళ సినీ దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి పేరరసు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

perarasu

ఒక అసోసియేషన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే దాన్ని మీడియా ముందు మాట్లాడొద్దని ప్రముఖ దర్శకుడు, తమిళ సినీ దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి పేరరసు (Perarasu) హితవు పలికారు. అరమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై పి.రామలింగం నిర్మాణ సారథ్యంలో శివం దర్శకత్వంలో కొత్త నటీనటులతో కమర్షియల్‌ థ్రిల్లర్‌ హర్రర్‌ మూవీ ‘పి2 ఇరువర్‌’ (P2)రూపొందించారు. ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఆడియో, ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. ఈ వేడుకకు నటులు రాజసింహన్‌, సంపత్‌ రామ్‌, నటి అస్మిత, నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌, నటుడు భగత్‌ విక్రాంత్‌, దర్శకుడు శరవణన్‌ సుబ్బయ్య, సినీ గేయ రచయిత స్నేహనన్‌, దర్శకులు ఎస్‌ఆర్‌ ప్రభాకరన్‌, పేరరసు, సీనియర్‌ నిర్మాత, నటుడు కె.రాజన్‌, నిర్మాత రామలింగం, దర్శకుడు శివం తదితరులు హాజరయ్యారు.

GPZHdplbUAIa6mS.jpeg

సంగీత దర్శకుడు దేవా మాట్లాడుతూ... ‘ఇప్పటివరకు ఎన్నో చిత్రాలకు సంగీతం సమకూర్చా. కానీ, హర్రర్‌ చిత్రానికి సంగీతం అందించ లేదు. ఆ లోటు ఈ సినిమాతో తీరింది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రామలింగానికి ధన్యవాదాలు’ అని అన్నారు. దర్శకుడు శివం మాట్లాడుతూ, ‘ఒక మంచి చిత్రాన్ని పూర్తి అంకితభావంతో రూపొందించాం. ప్రతి ఒక్కరి మద్దతును కోరుతున్నాం’ అన్నారు. నిర్మాత రామలింగం మాట్లాడుతూ... ‘ఇది నా తొలి సినిమా. ఫ్రెండ్‌షిప్‌ కారణంగా సినిమా నిర్మించే అవకాశం వచ్చింది. ప్రాజెక్టులో దేవా చేరిన తర్వాత ఎంతో బలం వచ్చినట్టైంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ చక్కటి సహకారం అందించారు’ అన్నారు.


p2

అతిథిగా పాల్గొన్న దర్శకుడు పేరరసు (Perarasu) మాట్లాడుతూ, ‘చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ దేవా గౌరవిస్తారు. ఇప్పటి అజిత్‌, విజయ్‌లను స్టార్‌ హీరోలుగా తయారు చేసింది ఆయనే. నిర్మాతలు సమ్మె అంటే సాధారణ విషయం కాదు. ఒక పరిశ్రమకు చెందిన యజమానులు సమ్మెకు దిగితే, ఆ శాఖ ఎన్ని సమస్యలను ఎదుర్కొంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. బడా కంపెనీలు సినిమాలు ఎందుకు తీయడం లేదు. తమతో సినిమాలు నిర్మించే నిర్మాతలు బాగుండాలని నటీనటులు కోరు కోవాలి. ఒక సినిమాకు పనిచేసే ప్రతి ఒక్కరూ అలా ఆకాంక్షింస్తే చిత్ర పరిశ్రమ బాగుంటుంది. అసోసియేషన్‌లో సమస్యలు ఉంటే మీడియాతో మాట్లాడొద్దు. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి’ అని హితవు పలికారు.

Updated Date - Aug 06 , 2024 | 04:28 PM