Indian2 Vs Teenz: ‘ఇండియన్‌-2’తో.. పోటీ పడుతున్న పార్తిబన్‌ ‘టీన్జ్‌’

ABN , Publish Date - Jul 05 , 2024 | 08:35 AM

నటుడు ఆర్‌.పార్తిబన్ దర్శకత్వం వహించి సొంతంగా నిర్మించిన ‘టీన్జ్‌’ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే, అదే రోజు ‘ఇండియన్‌-2’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

indain teenz

దర్శకనటుడు ఆర్‌.పార్తిబన్ (Parthiban) దర్శకత్వం వహించి సొంతంగా నిర్మించిన ‘టీన్జ్‌’ (Teenz) చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే, అదే రోజున విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నటించిన ‘ఇండియన్‌-2’ (Indian2) చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి.

GNMxL-DXYAADSM2.jpeg

2022లో పార్తిబన్ (Parthiban) నటించి దర్శకత్వం వహించిన నాన్‌లీనియర్‌ సింగిల్‌ షాట్‌ మూవీ ‘ఇరవిన్‌ నిళల్‌’ విడుదలై విజయం సాధించింది. ఈ సినిమాలో పాటల్లో నేపథ్య గాయని శ్రేయా ఘోషల్‌ ఆలపించిన ‘మాయావి’ పాటకు జాతీయ అవార్డు సైతం దక్కింది. ఇప్పుడు మరో వైవిధ్యభరితమైన కథతో అందరూ చిన్నపిల్లలే నటించిన ‘టీన్జ్‌’ (Teenz) మూవీ తెరకెక్కించారు.


GRf0sFNWkAAuSLk.jpeg

చైల్డ్‌ సెంట్రిక్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి డి.ఇమాన్ (D.IMMAN) సంగీతం అందించారు. కావ్‌మిక్‌ ఆరి సినిమాటోగ్రఫీ అందించగా, బయోస్కోప్‌ డ్రీమ్స్‌, ఆకీరా ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

GJ_QTnmWEAAABaU.jpeg

ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆర్‌.పార్తిబన్‌ (Parthiban) ప్రకటించినప్పటికీ ప్రమోషన్‌ కార్యక్రమాలు మాత్రం ఇంకా ప్రారంభించలేదు. దీంతో కేవలం పబ్లిసిటీ కోసమే ‘ఇండియన్‌-2’ (Indian2) విడుదలయ్యే తేదీలో రిలీజ్‌ చేయనునట్టు ప్రకటించారా? అనే చర్చ కోలీవుడ్‌లో సాగుతుంది.

Updated Date - Jul 05 , 2024 | 10:29 AM