Pa Ranjith: చిన్న చిత్రాలను ప్రేక్షకుల చెంతకు చేర్చడం కష్టం

ABN , Publish Date - Mar 14 , 2024 | 09:48 AM

ప్రస్తుతం చిన్న చిత్రాలను ప్రేక్షకుల వద్దకు చేర్చడం కష్టతరంగా మారిందని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ అన్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రెబల్‌’. ఈనెల 22న విడుదలకానుంది. స్టూడియోగ్రీన్‌ పతాకంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు పా. రంజిత్ పాల్గొన్నారు.

Pa Ranjith: చిన్న చిత్రాలను ప్రేక్షకుల చెంతకు చేర్చడం కష్టం
Pa Ranjith

ప్రస్తుతం చిన్న చిత్రాలను ప్రేక్షకుల వద్దకు చేర్చడం కష్టతరంగా మారిందని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ అన్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌ (GV Prakash Kumar) హీరోగా నటించిన తాజా చిత్రం ‘రెబల్‌’ (Rebel). ఈనెల 22న విడుదలకానుంది. స్టూడియోగ్రీన్‌ పతాకంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith) పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇది రెబల్‌ ఆడియో వేదికగా లేదు. నన్ను ప్రశంసించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలా ఉంది. ఇంతమంది నన్ను ప్రశంసిస్తున్నారంటే నేను నా విధులను సక్రమంగానే నిర్వహిస్తున్నాననే భావన కలుగుతోంది. ఈ సినిమా కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ముల్లై పెరియార్‌ ప్రాంతంలోని సమస్యలను ప్రస్తావించనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో దశాబ్దాలుగా ఉండే సమస్యను దర్శకుడు నికేష్‌ చాకచక్యంగా డీల్‌ చేశారు. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా పలువురి జీవితాల్లో వెలుగులు నింపారు. నా జీవితంలో కూడా ముఖ్యమైన మనిషి. హీరో జీవీ ప్రకాష్‌ చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా అందరికీ సక్సెస్‌ని ఇవ్వాలని పేర్కొన్నారు. (Rebel Movie Audio Release Event)


Rebel.jpg

హీరో జీవీ ప్రకాష్‌ మాట్లాడుతూ... పా.రంజిత్‌తో కలిసి ‘తంగలాన్‌’తో పాటు మరో చిత్రానికి పనిచేస్తున్నా. ఈ సినిమా బాగా వచ్చింది. శక్తి ఫిలిమ్స్‌ అధినేత శక్తివేలన్‌ ఈ సినిమాను చూశారు. అందుకే ఇంత సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని అన్నారు. దర్శకుడు నికేష్‌ మాట్లాడుతూ... నిర్మాతకు స్టోరీ వినిపించేందుకు వెళ్లినపుడు నా వయసు 24 యేళ్లు మాత్రమే. కానీ, నాపై ఎంతో నమ్మకం ఉంచి నిర్మాత జ్ఞానవేల్‌ ముందుకు వచ్చారు. ఆ తర్వాత షూటింగ్‌ ముగిసేంత వరకు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఈ సినియాను విజయవంతంగా పూర్తిచేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపారు. అలాగే, నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా, దర్శక నటుడు సుబ్రమణ్య శివ, నటుడు ఆదిత్య భాస్కర్‌, హీరోయిన్‌ మమిత బైజు తదితరులు ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను

***************************

*Manchu Manoj: కవల పిల్లలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్.. ట్విస్ట్ ఏమిటంటే?

**************************

Updated Date - Mar 14 , 2024 | 09:48 AM