The Goat: విజయ్‌ బ్యానర్లు, కటౌట్లపై నిషేధం..

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:39 AM

తాజాగా విజయ్‌ హీరోగా నటించిన ‘దిగోట్‌’ చిత్రం బ్యానర్లు సినిమా థియేటర్ల వద్ద కనిపించకపోవడంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ‘ది గోట్‌’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. కానీ థియేటర్ల వద్ద ఎటువంటి కటౌట్స్, బ్యానర్స్ లేకపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. విజయ్ బ్యానర్లు, కటౌట్లు కడితే శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయనే పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

Thalapathy Vijay

విల్లుపురం జిల్లా విక్రవాండిలో నిర్వహించనున్న తమిళగ వెట్టి కళగం (టీవీకే) మహానాడుకు పోలీసుల అనుమతి జాప్యం అవుతుండటంతో నటుడు విజయ్‌ (Thalapathy Vijay) అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా విజయ్‌ హీరోగా నటించిన ‘దిగోట్‌’ చిత్రం బ్యానర్లు సినిమా థియేటర్ల వద్ద కనిపించకపోవడంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ‘ది గోట్‌’ (The Goat) సినిమా విడుదలైన విషయం తెలిసిందే. విజయ్‌ సినిమాల రిలీజ్‌ కావటానికి వారం రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద పెద్ద పెద్ద బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటుచేసి అభిమానులు సందడి చేస్తుంటారు. ప్రస్తుతం విజయ్‌ సినిమా విడుదలైన థియేటర్లలో ఆ సినిమా బ్యానర్లు, కటౌట్లు లేకపోవడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్న విజయ్‌ సినిమా బ్యానర్లు, కటౌట్లు కడితే శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయనే కారణంగా పోలీసులు బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై నిషేధం విధించారని చెబుతున్నారు. ఇక ‘ది గోట్‌’ సినిమా విడుదలయ్యే నగరంలోని థియేటర్ల వద్ద బ్యానర్లు, కటౌట్లు కట్టేందుకు అనుమతించాలని కోరుతూ గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియకు రాష్ట్ర సినీ వీక్షకుల సంఘం వినతిపత్రం పంపినా ఫలితం లేదనేలా టాక్ వినబడుతోంది.


Vijay.jpg

న్యాయనిపుణులతో విజయ్‌ చర్చలు..: విక్రవాండిలో పార్టీ మహానాడు నిర్వహణకు అనుమతించే విషయమై పోలీసులు పంపిన నోటీసులోని 21 ప్రశ్నలకు సమాధానాలిచ్చే దిశగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) నాయకుడు, సినీ నటుడు విజయ్‌ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. రెండు రోజులుగా ఆయన మహానాడుకు పోలీసుల అనుమతి త్వరగా లభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ తదితర నాయకులతో చర్చించారు.

Updated Date - Sep 05 , 2024 | 11:39 AM