Nithya Menen: విజయ్‌ సేతుపతికి జంటగా నిత్యా.. మాములు పాత్ర కాదట!

ABN , Publish Date - Aug 24 , 2024 | 06:34 PM

ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి సరసన మలయాళ బ్యూటీ నిత్యామీనన్‌ నటించనున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మాత టీజీ త్యాగరాజన్‌ సమర్పణలో నిర్మాతలు సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో గుర్తింపు పొందిన పాండిరాజ్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

Vijay Sethupathi and Nithya Menen

ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) సరసన మలయాళ బ్యూటీ నిత్యామీనన్‌ (Nithya Menen) నటించనున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ (Sathya Jyothi Films) పతాకంపై నిర్మాత టీజీ త్యాగరాజన్‌ (TG Thyagarajan) సమర్పణలో నిర్మాతలు సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో గుర్తింపు పొందిన పాండిరాజ్‌ (Pandiraj) ఈ చిత్రానికి దర్శకుడు. ఈ ప్రాజెక్టు వివరాలను తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Also Read- Hero Nani: హేమ కమిటీ రిపోర్ట్‌.. ‘ఇలా ఎక్కడ జరుగుతుంది’ అని షాకయ్యా.

1950 సంవత్సరం నుంచి మక్కల్‌ తిలగం డాక్టర్‌ ఎంజీఆర్‌, నడిగర్‌ తిలగం శివాజీ గణేశన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్లోబల్‌ స్టార్‌ కమలహాసన్‌, అజిత్‌ కుమార్‌, ధనుష్‌ వంటి గొప్ప నటులతో అనేక హిట్‌ చిత్రాలను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ... తొలిసారి దర్శకుడు పాండిరాజ్‌ - విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో ఓ చిత్రానికి ప్లాన్‌ చేసింది. సత్యజ్యోతి బ్యానర్‌లో విజయ్‌ సేతుపతి నటించే తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. భారీ వ్యయంతో రూపొందించే ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పలు లొకేషన్లలో జరుపుకుంటోంది. హీరోయిన్‌ నిత్యామీనన్‌ త్వరలోనే షూటింగ్‌లో జాయిన్‌ కానున్నారు. అలాగే, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. (Nithya Menen Pair Up With Vijay Sethupathi)


Nithya-Menen.jpg

ఇక ఇందులో నిత్యామీనన్ పాత్ర గురించి అప్పుడే కోలీవుడ్‌లో టాక్ మొదలైంది. విజయ్ సేతుపతి పాత్ర ఎలా అయితే ఉంటుందో.. నిత్యామీనన్ పాత్ర కూడా అంతే గొప్పగా దర్శకుడు డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే నిత్యామీనన్ కథ విన్న వెంటనే ఓకే చెప్పిందని, ఆమె కెరీర్‌లో ఇది మరో మైలురాయి చిత్రంగా నిలుస్తుందనేలా టాక్ వినబడుతోంది. సత్యజ్యోతి బ్యానర్‌లో సినిమా అంటే కంటెంట్ బేస్డ్ చిత్రమని ఫిక్స్ అయిపోవచ్చు. అందులోనూ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నర్ నిత్యామీనన్ హీరోహీరోయిన్లు అంటే.. ఈ సినిమా కోలీవుడ్‌లో మరో సంచలనం అవుతుందనేలా కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read Latest Cinema News

Updated Date - Aug 24 , 2024 | 06:34 PM