Annapoorani: ముదిరిన వివాదం.. ఓటీటీ నుంచి నయనతార సినిమా ఔట్!
ABN , Publish Date - Jan 11 , 2024 | 04:02 PM
అనుకున్నంత అయింది. థియేటర్లలో విడుదల సమయంలో, విడుదల అయ్యాక పెద్ద రచ్చ, చర్చ లేపిన సినిమా అన్నపూర్ణి. నయనతార లీడ్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం 10 రోజుల క్రితం ఓటీటీలోకి రాగా దానిని సదరు సంస్థ తన ఫ్లాట్‌ఫాం నుంచి తొలగించింది.
అనుకున్నంత అయింది. థియేటర్లలో విడుదల సమయంలో, విడుదల అయ్యాక పెద్ద రచ్చ, చర్చ లేపిన సినిమా అన్నపూర్ణి (Annapoorni). నయనతార (Nayanthara) లీడ్ రోల్‌లో వచ్చిన తన 75వ చిత్రంగా గత డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. అనంతరం ఓటీటీలోకి కూడా వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తీసుకురావడమే కాక ఓ వివాదం తీవ్ర రూపదాల్చడం గమనార్హం.
సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ యువతి నాన్‌వెజ్ వంటలు చేస్తూ పేరు తెచ్చుకోవడంతో పాటు ఓ రెస్టారెంట్‌ను పెట్టాలని కలలు కంటూ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌తో పాటు ఓ హిందూ అమ్మాయి నమాజ్ చేసినట్లుగా సినిమాలో చూపించడం లవ్ జిహాద్‌ను ప్రేరేపించేలా ఉందని, మత విశ్వాసాలను దెబ్బ తినేలా సినిమా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు మండి పడ్డాయి. థియేటర్లో విడుదలైనప్పుడు వివాదం పెద్దగా ప్రచారంలోకి రాకపోయినప్పటికీ తర్వాతే అసలు కథ మొదలయింది.
సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ అన్నపూర్ణి (Annapoorni) చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చిందో సినిమా జనంలోకి మరింతగా వెళ్లింది. సినిమాపై సర్వత్రా విమర్శలు రెట్టింపవుతూ రావడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఏకంగా బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ అంటూ సోషల్‌మీడియా ఎక్స్‌లో టాప్‌లో ట్రెండింగ్ అయింది.ఇదిలాఉండగా శివసేన మాజీ నేత రమేష్ సోలంకి నయనతార (Nayanthara), ఈ సినిమా మేకర్స్‌పై కేసు పెట్టగా ఎఫ్‌ఐర్ కూడా నమోదైంది.
అంతేకాకుండా రాముడు మాంసం తింటాడంటూ దేవుళ్లను కించపరిచే విధంగా సినిమాలో డైలాగులు ఉన్నాయంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) నేత శ్రీరాజ్ నాయర్ ఫైర్ అయ్యారు. అలానే బ్రాహ్మణ అమ్మాయి మాంసాహారం వండటం వంటి సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తు సినిమాను వెంటనే నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
దీంతో ఈ వివాదంపై సినిమా నిర్మాతలైన జీ స్టూడియోస్ ప్రజలకు, విశ్వహిందూ పరిషత్ (VHP)లకు క్షమాపణలు చెబుతూ అన్నపూర్ణి (Annapoorni)సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించేసింది. అయితే ఈ అన్నపూరణి సినిమా కొత్త వెర్షన్‌ను ఏమైనా తీసుకువస్తారా అలానే వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది.