Komal Sharma: నాడు ఆట‌లో.. నేడు సినిమాల్లో దూసుకుపోతున్న ‘కోమల్‌ శర్మ’

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:04 PM

స్పోర్ట్స్ నేప‌థ్యం నుంచి వచ్చి వ‌రుస సినీ అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది మాజీ మిస్ త‌మిళ‌నాడు, స్క్వాష్ ప్లేయ‌ర్‌, న‌టి కోమల్‌ శర్మ. తాజాగా బాలీవుడ్‌లో రెండు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒక‌టి చొప్పున‌ సినిమా చేస్తు బిజీగా ఉంది.

Komal Sharma

తమిళంలోనే కాకుండా, మాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో వ‌రుస ఆఫ‌ర్లతో దూసుకెళుతుంది మాజీ మిస్ త‌మిళ‌నాడు (Miss Tamil Nadu), స్క్వాష్ ప్లేయ‌ర్‌, హీరోయిన్‌ కోమల్‌ శర్మ (Komal Sharma). ప్ర‌స్తుతం త‌మిళ , మ‌ల‌యాళాల్లో మోహ‌న్ లాల్‌, విజ‌య్ న‌టిస్తున్న రెండు భారీ ప్రాజెక్టు చిత్రాల‌లో న‌టిస్తున్న ఈ ముద్ద‌గుమ్మ ఈ చిత్రాలతో తన సినిమా కెరీర్‌ టర్న్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Komal Sharma

త‌మిళ‌నాడులో పుట్టి పెరిగిన కోమ‌ల్ శ‌ర్మ (Komal Sharma) రెండు సార్లు మిస్ త‌మిళ‌నాడు కిరీటం ద‌క్కించుకుంది. ఆపై స్క్వాష్ ప్లేయ‌ర్‌గా త‌మిళ‌నాడు త‌రుపున ఆడి రాష్ట్ర‌, జాతీయ స్థాయిల్లో చాంఫియ‌న్ షిప్‌లు సైతం గెలిచింది. 2013లో సీనియర్‌ దర్శకుడు ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చట్టప్పడి కుట్రం’ అనే సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన కోమల్‌ శర్మ ఆ తర్వాత ‘అమైదిపడై-2’, ‘వైగై ఎక్స్‌ప్రెస్‌’, ‘పబ్లిక్‌’, బాలీవుడ్‌లో హంగామా, తెల‌గులో అను అనే ఆరేడు చిత్రాల్లో నటించింది.


Komal Sharma

ఎక్కువ‌గా మోహ‌న్‌లాల్ (Mohanlal), ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ (Priyadarshan) చిత్రాల్లో క‌నిపించి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్ద‌గుమ్మ కోమ‌ల్ శ‌ర్మ (Komal Sharma). ప్ర‌స్తుతం మోహన్‌లాల్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తూ రూపొందిస్తున్న బరోజ్ (Barroz), త‌మిళంలో అగ్ర హీరో విజయ్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘ది గోట్‌’(The Greatest of All Time) లో కీలక పాత్ర పోషిస్తుంది.

Komal Sharma

ఈ సంద‌ర్భంగా ఆమో ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘ది గోట్‌’లో హీరో విజయ్‌తో కలిసి నటించే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని సినిమా భారీ విజయం సాధించి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్‌ సృష్టిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

Komal Sharma

అలాగే రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించ‌బోతున్నాన‌ని అవి నా సినీ కెరీర్‌ను మలుపుతిప్పుతాయని ఆశిస్తున్నాను’ అని కోమ‌ల్ శ‌ర్మ (Komal Sharma) పేర్కొంది.

Updated Date - Jul 10 , 2024 | 01:04 PM