విజయకాంత్‌కు రుణపడివున్నా: ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ చిత్రాల సంగీత దర్శకుడు

ABN , Publish Date - Dec 25 , 2024 | 09:49 AM

మెగాస్టార్ చిరంజీవి ‘మాస్టర్’ చిత్రానికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌ని టర్న్ చేసిన ‘తొలిప్రేమ’ చిత్రానికి సంగీతం అందించిన సంగీత దర్శకుడు.. దివంగత నటుడు విజయకాంత్‌కు రుణపడివుంటానని అన్నారు. ఎందుకు ఆయన అలా అన్నారంటే..

తన సినీ ప్రయాణంలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ‘వారారు వారారు అళగర్‌ వారారు’ అనే పాట తనకు మంచి గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని దానికి కెప్టెన్‌ విజయకాంత్‌కు రుణపడివున్నానని ప్రముఖ సీనియర్‌ సంగీత దర్శకుడు దేవా అన్నారు. దేవా (Music Director Deva) ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ మదురైలో మ్యూజికల్‌ నైట్‌ జరుగనుంది. ఈ వివరాలను ఆయన తాజాగా వెల్లడించారు.

Also Read- ఎన్టీఆర్ విషయంలో మాట మార్చిన కౌశిక్ తల్లి.. ఏమందంటే

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మదురైలో ప్రతియేటా జరిగే చిత్తిరై వేడుకల్లో ‘వారారు వారారు అళగర్‌ వారారు’ పాట వినిపిస్తూనే ఉంటుంది. నేను ఎన్నో పాటలు పాడినప్పటికీ ఈ పాటతో నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ విషయంలో దివంగత నటుడు విజయకాంత్‌కు రుణపడివుంటాను. ఈ పాటను నేను తొలిసారి మదురై గడ్డపై లైవ్‌లో పాడనున్నాను. ఈ అవకాశాన్ని కూడా విజయకాంత్‌ కల్పించారు. మదురైలో జరిగే సంగీత విభావరిలో నాతో పాటు గాయకులు మనో, అనురాధా శ్రీరామ్‌, అజయ్‌ కృష్ణ, సబేష్‌, మురళి, శ్రీకాంత్‌ దేవా సహా దాదాపు 60 మంది వరకు పాల్గొంటారు.


vijaykanth.jpg

తరాలు మారినప్పటికీ నాది, ఇళయరాజా సంగీతం స్థిరస్థాయిగా నిలిచిపోయినందుకు ధన్యుడుని. యంగ్‌ జనరేషన్‌లో అనిరుధ్‌ సంగీతం ఇష్టం. అనేక చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వచ్చినా నేను అంగీకరించలేదు. సంగీత దర్శకుడుగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి పనిచేయాలని ఇష్టపడుతున్నానని పేర్కొన్నారు. కాగా సంగీత దర్శకుడు దేవా తెలుగు చిత్రాలకు సైతం పని చేసి ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘మాస్టర్’ చిత్రానికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్‌ని టర్న్ చేసిన ‘తొలిప్రేమ’ చిత్రానికి ఆయన సంగీతం అందించారు. ఆ సినిమాలకు దేవా ఇచ్చిన సంగీతం, పాటలు ఎంత ప్లస్ అయ్యాయో తెలియంది కాదు.

Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

Also Read-Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌ని కాపాడటం కోసం మహా కుట్ర

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 25 , 2024 | 09:49 AM