హీరో విశాల్ - లైకా ప్రొడక్షన్ ఖాతాల ఆడిట్: హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Feb 04 , 2024 | 12:16 PM
హీరో విశాల్, ప్రముఖ సినీ నిర్మాణ కంపెనీ లైకా ప్రొడక్షన్‌ల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలను ప్రముఖ ఆడిటర్ నూతలపాటి శ్రీకృష్ణ ఆడిట్ చేయనున్నారు. మద్రాసు హైకోర్టు ఆదేశం మేరకు శ్రీకృష్ణ తనిఖీ చేసి కోర్టుకు నివేదికను సమర్పించనున్నారు. మూడేళ్లకు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్‌లను ఆడిటర్‌కు అందజేయాలని విశాల్, లైకాలను న్యాయమూర్తి పీటీ ఆషా ఆదేశించారు.
హీరో విశాల్ (Hero Vishal), ప్రముఖ సినీ నిర్మాణ కంపెనీ లైకా ప్రొడక్షన్స్‌ల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలను ప్రముఖ ఆడిటర్ నూతలపాటి శ్రీకృష్ణ ఆడిట్ చేయనున్నారు. మద్రాసు హైకోర్టు (Madras High Court) ఆదేశం మేరకు శ్రీకృష్ణ (Sri Krishna) తనిఖీ చేసి కోర్టుకు నివేదికను సమర్పించనున్నారు. ప్రముఖ సినీ ఫైనాన్షియర్, సినీ నిర్మాత, గోపురం ఫిలిమ్స్ అధినేత అన్బుచెళియన్ (Anbu Chezhian) వద్ద సినీ నిర్మాణం కోసం హీరో విశాల్ (విశాల్‌కృష్ణ) రూ. 21.29 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఒప్పందం మేరకు ఈ మొత్తాన్ని అన్బుచెళియన్‌కు లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) చెల్లించగా, ఈ మొత్తాన్ని 30 శాతం వార్షిక వడ్డీతో హీరో విశాల్ లైకాకు చెల్లించాల్సి ఉంది. కానీ, రుణాన్ని విశాల్ చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో లైకా ప్రొడక్షన్స్ హైకోర్టును ఆశ్రయించడంతో గత కొన్ని నెలలుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.
విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు గతంలో ఆదేశించగా, ఆ మేరకు డిపాజిట్ చేసేందుకు తన వద్ద వనరులు లేవని పేర్కొంటూ తన బ్యాంకు ఖాతాల వివరాలను విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు అందజేశారు. అదే సమయంలో లైకా ప్రొడక్షన్స్ బ్యాంకు ఖాతాల తనిఖీ కోసం ఆడిటర్‌ను నియమించాలని కోరారు. దీంతో విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య బ్యాంకు ఖాతాల లావాదేవీలను ఆడిట్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ఇందుకోసం ఆడిటర్ శ్రీకృష్ణను నియమిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ పీ టీ ఆషా (P T Asha) ఉత్తర్వులు జారీ చేశారు. పైగా, మూడేళ్లకు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్‌లను ఆడిటర్‌కు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Guntur Kaaram: అఫీషియల్‌గా ‘గుంటూరు కారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. విశేషమేమిటంటే?
************************
*Teja Sajja: మహేశ్ బాబుని ‘మగేశ్’ అనేవాడిని.. అప్పుడాయన ఏమనేవారంటే..
*************************
*Chiranjeevi: పద్మవిభూషణుడికి ఉపాసన అభినందన సభ.. హాజరైన తెలంగాణ సీఎం
*****************************
*Love Guru: శోభనం రోజు.. భర్త ఎదురుగానే భార్య ఏం చేస్తుందో చూశారా!
**************************