Maharaja: 100 కోట్ల క్లబ్‌లో.. విజయ్ సేతుపతి ‘మహారాజ’

ABN , Publish Date - Jul 05 , 2024 | 09:36 AM

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’. అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది. తాజాగా ఈ సినిమా త‌క్కువ స‌మ‌యంలో వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

maharaja

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన 50వ చిత్రం ‘మహారాజ’(Maharaja). నితిలన్ సామినాథన్ (Nithilan Swaminathan) దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్‌ నటుడు అనురాగ్‌ కశ్యప్ (Anurag Kashyap) కీలక పాత్ర పోషించారు.

Maharaja

తాజాగా ఈ చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. జూన్ 14న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.20 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం త‌క్కువ స‌మ‌యంలో ఈ ఘ‌న‌త సాధించింది.


Maharaja

ఇండ్ల‌పై దుండ‌గుల దాడులు, మహిళలపై లైంగిక వేధింపులను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించారు. ఫస్టాఫ్ అంతా కామెడీతో నడిపిస్తూ.. ఎవరు కథను ముందే ఊహించని విధంగా నడిపిస్తూ సమ్ థింగ్ ఎదో జరుగబోతుందనే ఫీల్ చివ‌రి వ‌ర‌కు సీట్ ఎడ్జ్‌లో కూర్చో బెడుతుంది.

Maharaja

గత నెల 14వ తేదీన విడుదలైన ఈ చిత్రాన్ని కేవలం రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించగా, 20 రోజుల్లో ఇప్పటివరకు రూ.100 కోట్లకుపైగా వసూళ్ళను రాబట్టింది. అలాగే, ఈ సినిమా కంటే ముందు వచ్చిన మ‌రో త‌మిళ చిత్రం ‘అరణ్మనై-4’ కూడా రూ.100 కోట్ల కలెక్షన్లు రాబ‌ట్టిన‌ విషయం తెలిసిందే.

Updated Date - Jul 05 , 2024 | 09:56 AM