Madraskaaran: షేన్‌ నిగమ్‌ జంటగా నిహారిక నటించిన సినిమా టీజర్ వదిలారు..

ABN , Publish Date - Jul 26 , 2024 | 08:54 PM

మాలీవుడ్‌ నటుడు షేన్‌ నిగమ్‌, టాలీవుడ్‌ నటి నిహారిక, కోలీవుడ్‌ నటుడు కలైయరసన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ‘మద్రాస్‌కారన్‌’ చిత్ర ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బి.జగదీష్‌ నిర్మాణంలో ‘రంగోలి’ చిత్ర ఫేం వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో వైవిధ్యభరితమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌గా ఈ మూవీని రూపొందించారు. ఈ ఆడియో రిలీజ్‌ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Madraskaaran Teaser Release Event

మాలీవుడ్‌ నటుడు షేన్‌ నిగమ్‌ (Shane Nigam), టాలీవుడ్‌ నటి నిహారిక (Niharika Konidela), కోలీవుడ్‌ నటుడు కలైయరసన్‌ (Kalaiyarasan) ప్రధాన పాత్రలు పోషించిన ‘మద్రాస్‌కారన్‌’ (Madraskaaran) చిత్ర ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బి.జగదీష్‌ నిర్మాణంలో ‘రంగోలి’ చిత్ర ఫేం వాలి మోహన్‌ దాస్‌ (Vaali Mohan Das) దర్శకత్వంలో వైవిధ్యభరితమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌గా ఈ మూవీని రూపొందించారు. ఈ ఆడియో రిలీజ్‌ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Also Read- Raayan Review: రాయన్  రివ్యూ.. ధనుష్ 50వ చిత్రం ఎలా ఉందంటే.. 

ఈ కార్యక్రమంలో దర్శకుడు వాలి మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రారంభించడానికి ప్రధాన కారణం నిర్మాత జగదీష్‌, నటి ఐశ్వర్య దత్తా. వీరిద్దరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు. నటి నిహారిక మాట్లాడుతూ.. ‘టీజర్‌ ప్రతి ఒక్కరికీ నచ్చిందనుకుంటున్నాను. పలువురు ప్రతిభావంతులు కలిసి ఈ ప్రాజెక్టు కోసం పనిచేసి, ఒక మంచి సినిమా రూపొందించాం. షేన్‌ నిగమ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు వాలికి ధన్యవాదాలు’ అని తెలిపారు. (Madraskaaran Audio Launch)


Madraskaaran.jpg

నటుడు కలైయరసన్‌ మాట్లాడుతూ.. నా సొంతూరు మద్రాస్‌. కానీ, ఇందులో పుదుక్కోట వాసిగా నటించాను. షేన్‌ నిగమ్‌ మంచి నటుడు. వాలి మేకింగ్‌ బాగా నచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ కోవకు చెందిన చిత్రమిదని పేర్కొన్నారు. షేన్‌ నిగమ్‌ మాట్లాడుతూ.. నా మీద నాకే సందేహం ఉన్న సమయంలో వాలీ, జగదీష్‌ ఎంతో నమ్మకంతో ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేసిన ఎస్‌టీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. (Madraskaaran Teaser Launch)

Read Latest Cinema News

Updated Date - Jul 26 , 2024 | 08:57 PM