Kollywood: నిర్మాతలకి షాకిచ్చిన కోర్టు.. రివ్యూస్

ABN , Publish Date - Dec 03 , 2024 | 06:31 PM

రివ్యూయర్లకి షాకిద్దామనుకున్న నిర్మాతలకి హైకోర్టు షాకిచ్చింది. ఇంతకీ ఏమైందంటే..

Madras High Court

రానురాను చిత్ర పరిశ్రమకు రివ్యూలు సమస్యగా మారుతున్నాయంటూ వీటిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలని కోలీవుడ్‌ నిర్మాతలు తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్‌ ప్రాంగణంలోకి యూట్యూబ్‌ ఛానల్స్‌ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. అలాగే సినిమా రిలీజైన మొదటి మూడు రోజులు ఎలాంటి రివ్యూలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని ఆలా ఆదేశాలు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


తాజాగా ఈ పిటిషన్‌ని విచారించిన హైకోర్టు పిటిషన్ ని తిరస్కరించింది. నిర్మాతలు.. యూట్యూబ్, పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లలో రివ్యూయర్లు ఎలాంటి పోస్టులు పెట్టొదన్న కోరికలను తోసిపుచ్చింది. ప్రధానంగా కంగువా, వేట్టయన్, ఇండియన్ 2 వంటి సినిమాల కలెక్షన్లు తగ్గటానికి వీరి నెగిటివ్ రివ్యూలే కారణమంటూ నిర్మాతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూట్యూబ్‌లలో రివ్యూలు ఇచ్చే వారిపై జులుం విదిలించాలని ప్రయత్నించారు. కానీ.. ఆ కోరిక నెరవేరలేదు.

Updated Date - Dec 03 , 2024 | 06:55 PM