Chandrababu Biopic: ‘చంద్రబాబు’ బయోపిక్‌లో ధనుష్!
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:00 PM
ఇసైజ్ఞాని ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్న ధనుష్.. ఇప్పుడు మరో బయోపిక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ బయోపిక్‌ను స్వయంగా ధనుష్ నిర్మించనున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..
ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్న ధనుష్.. ఇప్పుడు మరో నటుడి బయోపిక్‌లోనూ నటించబోతున్నట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. గత 60, 70 దశకంలో నటుడుగా, కమెడియన్‌గా, దర్శకుడిగా, నేపథ్యగాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన నటుడు చంద్రబాబు. దివంగత మహానటులైన ఎంజీఆర్, శివాజీ గణేశ్‌లకు ధీటుగా ఆయన నటించారు.
ఆ కాలంలోనే గ్రీన్‌వేస్ రోడ్డులో 20 ఎకరాల్లో ఇల్లు నిర్మించి, ఆ ఇంటి మొదటి అంతస్తులోకి నేరుగా తన కారు వెళ్ళి పార్కింగ్ చేసేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎంజీఆర్ హీరోగా ‘మాడి వీట్టు ఏళై’ అనే చిత్రాన్ని చంద్రబాబు స్వీయ నిర్మాణంలో ప్రారంభించగా, అది అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో ఆయన ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో 1974లో ఆయన తుదిశ్వాస విడిచారు.
Also Read-Tammareddy Bharadwaja: సీఎంతో భేటీకి చిరంజీవి కుటుంబం నుంచి ఎందుకు వెళ్లలేదో...
కోలీవుడ్ గొప్ప నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన చంద్రబాబు బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోగా ధనుష్ నటించనున్నట్టు సమాచారం. ఈ బయోపిక్‌ను ధనుష్ స్వయంగా నిర్మించడమే కాకుండా, చంద్రబాబు పాత్రలో నటించాలని భావిస్తూ, చంద్రబాబు కుటుంబ సభ్యుల అనుమతి కోరినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. కోలీవుడ్‌లో మాత్రం ‘చంద్రబాబు బయోపిక్‌లో ధనుష్’ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read-Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారంటే..
మరోవైపు ధనుష్ ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటనతో పాటు చిన్న గ్లింప్స్ కూడా వచ్చింది. ఈ బయోపిక్ కాకుండా.. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన ‘కుబేర’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీలలో రూపొందుతున్న ఈ మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్‌ను శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.